Skip to main content

అల వైకుంఠపురములో టీమ్ పై అనిల్ రావిపూడి సెటైర్ వేశాడా?

అల వైకుంఠపురములో టీమ్ పై అనిల్ రావిపూడి సెటైర్ వేశాడా?
అల వైకుంఠపురములో టీమ్ పై అనిల్ రావిపూడి సెటైర్ వేశాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రంలోని రెండు పాటలను విడుదల చేయగా, రెండింటికీ సుపెర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రెండు పాటలకు కూడా స్పెషల్ వీడియో షూట్ చేసి మరీ సాంగ్ ను రిలీజ్ చేయడంతో వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. సామజవరగమన సాంగ్ ఇప్పటికే 55 మిలియన్ వ్యూస్ దాటి పరుగులు పెడుతోంది. యూట్యూబ్ లో ఒక పాట మరేదీ ఇన్ని లైక్స్ తెచ్చుకోలేదు. 800k లైక్స్ వైపు దూసుకెళ్తోంది. ఇక దీపావళి సందర్భంగా విడుదల చేసిన రాములో రాముల కూడా తొలి పాట తరహాలోనే అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. అప్పుడే 350k లైక్స్ వచ్చేసాయి. ప్రమోషన్స్ పరంగా ఇంత అగ్రసీవ్ గా వెళ్ళడానికి సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రధాన కారణం. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు రెండూ సంక్రాంతి సందర్భంగా ఒకే రోజు విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12న విడుదల కానున్నాయి. ఒకేరోజు విడుదల కానున్నాయి కాబట్టి కలెక్షన్స్ కూడా డివైడ్ అవుతాయి. ఆశించే కలెక్షన్స్ లో దాదాపు 40 శాతం కలెక్షన్స్ పక్క సినిమాకు వెళ్లిపోతాయి. అందుకే అల వైకుంఠపురములో టీమ్ క్రేజీ ప్రాజెక్ట్ గా మార్కెట్ లో నిలవాలనుకుంటోంది. అందుకే ప్రమోషన్స్ పరంగా ఇంత అగ్రసీవ్ గా వెళుతున్నారు. మరోవైపు సరిలేరు నీకెవ్వరు టీమ్ మాత్రం ప్రమోషన్స్ విషయంలో అసలు కంగారు పడట్లేదు. ముందు సినిమా కంప్లీట్ చేయడంపైనే తమ దృష్టిని నిలిపింది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నుండి ప్రమోషన్స్ షురూ చేయలనుకుంటోంది.

అందుకే దీపావళికి కూడా పోస్టర్లు మాత్రమే విడుదల చేసింది. విజయశాంతి పోస్టర్ ఒకటి, మహేష్ పోస్టర్ ఒకటి, రష్మిక లుక్ రివీల్ చేసే పోస్టర్ ఒకటి.. మొత్తం మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. మూడు పోస్టర్లలోనూ సినిమా జనవరి 12న విడుదలవుతుందని హైలైట్ అయ్యేలా చేసింది. పోస్టర్లతోపాటు ఒక సెటైరికల్ వీడియో కూడా వదిలింది. ఇందులో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో సినిమా స్టోరీ గురించి లీక్స్ చేస్తుంటారు. ఈలోగా అనిల్ రావిపూడి వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగితే సినిమాపైన జనాలకు ఆసక్తి కలిగిస్తున్నాం అంటారు. దానికి వెంటనే అనిల్ రావిపూడి స్పందిస్తూ మన సినిమా వచ్చేది సంక్రాంతికి, ఇది ఇంకా దీపావళి మాత్రమే అంటాడు.

అంటే ప్రమోషన్స్ విషయంలో కంగారు పడకండి అంటూ అటు మహేష్ ఫ్యాన్స్ కు, ప్రమోషన్స్ లేవని సెటైర్ వేసే యాంటీ ఫ్యాన్స్ కు, ప్రమోషన్స్ విషయంలో కంగారు పడిపోతున్న అల వైకుంఠపురములో టీమ్ కు.. అందరికీ కలిపి ఒకే సెటైర్ వేసాడు. ఈ సెటైర్ తో మహేష్ ఫ్యాన్స్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపాడు అనిల్ రావిపూడి. మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ లా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి అంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ కాబట్టి ఈ సంక్రాంతి నవ్వుల పండగ అవుతుందని ఆశిస్తున్నారు మహేష్ అభిమానులు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36amJ3M

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...