Skip to main content

రాహుల్ చీప్ అంటూ వీడియో హల్చల్.. ఇక విన్నర్ అవ్వడం కష్టమేనా?

రాహుల్ చీప్ అంటూ వీడియో హల్చల్.. ఇక విన్నర్ అవ్వడం కష్టమేనా?
రాహుల్ చీప్ అంటూ వీడియో హల్చల్.. ఇక విన్నర్ అవ్వడం కష్టమేనా?

బిగ్ బాస్ 3 తెలుగు ఇక చివరికి వచ్చేసింది. మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరనేది స్పష్టమైపోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫినాలేను ఎలా నిర్వహించాలన్న దానిపై యాజమాన్యం ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ పనులు ఇలా ఉంటే, లాస్ట్ వీక్ కు చేరిన కంటెస్టెంట్స్ లో ఉత్కంఠ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ తో శివజ్యోతి ఎలిమినేట్ అయిపోవడంతో ఫైనల్స్ కు రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, అలీ చేరినట్లయింది. ఈ ఐదుగురిలో ఒకరు ఈ వారం చివరికి బిగ్ బాస్ టైటిల్ ను చేజిక్కించుకుంటారు.

ఈ ఐదుగురిలో అందరికంటే ముందు ఫైనల్స్ కు చేరి రాహుల్ మిగతా కంటెస్టెంట్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు. సీజన్ మొదట్లో రాహుల్ సిప్లిగంజ్ చాలా వీక్ గా కనిపించాడు. తొలి రెండు వారాల్లోనే తను చాలా బద్దకస్తుడని పేరు బయటకు వచ్చేసింది. టాస్క్ లు సరిగ్గా చేయడు, మధ్యలోనే గివప్ అంటాడు. పాటలు పాడమంటే మధ్యలోనే మర్చిపోయి నా వల్ల కాదంటాడు. ఎప్పుడూ మౌసంబిలు తినడం తప్పవేరే పని చేయడు, సరిగ్గా మాట్లాడడం అసలే రాదు. నాగార్జున చేతే చాలా సార్లు సరిగ్గా మాట్లాడమని చివాట్లు పెట్టించుకున్నాడు. ఇలా రాహుల్ గురించి మొదట్లో చాలా నెగటివిటీ ఉండేది. అయితే పునర్నవితో నడిపించిన రిలేషన్ షిప్, శ్రీముఖితో పడిన గొడవలు రాహుల్ కు మైలేజిను అందించాయి. గంటసేపు బిగ్ బాస్ ఎపిసోడ్ లో రాహుల్ కు ఫుటేజ్ దొరికేలా చేసాయి. దీంతో రాహుల్ స్ట్రాంగ్ అవుతూ వచ్చాడు. శ్రీముఖి అదే పనిగా రాహుల్ ను టార్గెట్ చేయడంతో సింపతీ ఓట్లు పెరిగాయి.

ఈ విషయం శ్రీముఖి పసిగట్టి అసలు రాహుల్ ను పట్టించుకోవడమే మానేసింది. పూర్తిగా అవాయిడ్ చేసింది. అయినా కానీ రాహుల్ ఫేక్ ఎలిమినేట్ అయి, మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇవ్వడం జనాలలో గుర్తింపునిచ్చింది. దీంతో రాహుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ లో రాహుల్ కు అదృష్టం కలిసివచ్చింది. టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న అలీ, బాబాను ఫిజికల్ గా అటాక్ చేయడంతో టాస్క్ నుండి తప్పించడంతో రాహుల్ టాప్ లోకి వెళ్ళాడు. అలాగే డొమినోస్ టాస్క్ లో గాలి తనవైపు ఎక్కువ రాకపోవడంతో గెలిచి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అందరినీ వెనక్కి నెట్టి మొదట బిగ్ బాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. టైటిల్ విన్నర్ ఫెవరెట్ గా నిలిచాడు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. బిగ్ బాస్ 1 సమయంలో దీక్షా పంత్, రాహుల్ తో కలిసి చేసిన మంగమ్మ అనే సాంగ్ ప్లే చేసినప్పుడు ఇదేం సాంగ్ అంటూ కంటెస్టెంట్స్ వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా రాహుల్ చెప్పడానికి వీల్లేని పదాలతో ఆ కంటెస్టెంట్స్ ను దూషించడం జరిగింది. పనిలో పనిగా బిగ్ బాస్ పై కూడా విమర్శలు చేసాడు. ఇప్పుడు ఈ వీడియో రాహుల్ అంటే పడని వాళ్లకు చిక్కింది. రాహుల్ సిప్లిగంజ్ ఎంతటి చీప్ ఫెలోనో చూడండి అంటూ ఆ వీడియోను చూపిస్తున్నారు. అవతలి వారిని బండ బూతులు తిడుతూ అసలు మాట్లాడడ రాని వ్యక్తి బిగ్ బాస్ విన్నర్ ఎలా అవుతాడంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వీడియో వల్ల రాహుల్ కు ఏమైనా మైనస్ అవుతుందేమో చూడాలి.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BLX1V5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...