Skip to main content

మెగా సినిమాలకే అంకితమైపోనున్న కొరటాల శివ

మెగా సినిమాలకే అంకితమైపోనున్న కొరటాల శివ
మెగా సినిమాలకే అంకితమైపోనున్న కొరటాల శివ

కొరటాల శివ.. కమర్షియల్ దర్శకుడిగా అనతికాలంలోనే పేరు సంపాదించుకున్నాడు. అయితే ఒట్టి కమర్షియల్ చిత్రాలు చేసేస్తే అందులో కొరటాల శివ స్పెషలిటీ ఏముంది. అందుకే ఏదైనా మెసేజ్ పై కమర్షియల్ హంగులను అద్ది రుచికరంగా ప్రేక్షకులకు అందిస్తాడు. అందుకే కొరటాల శివ సినిమాలకు ఆ క్రేజ్. చేసిన నాలుగు సినిమాలూ సూపర్ హిట్ అవ్వడంతో కొరటాల శివ సినిమాలపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే ఇప్పటివరకూ ఇద్దరే దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో ప్లాప్ అన్నది లేకుండా ముందుకు వెళుతున్నారు. మొదటి వ్యక్తి రాజమౌళి అయితే, మరొకరు కొరటాల శివ. ప్రతి సినిమాలోనూ మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల శివ చిరంజీవితో చిత్రంలోనూ మెసేజ్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. చిరంజీవితో చేయబోయే చిత్రంలో కొరటాల శివ దేవాలయాల్లో జరిగే మోసాల గురించి ప్రశ్నిస్తాడని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపిస్తాడు. దేవాలయాల భూములంటే అవేవో సొంత భూముల్లా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటారు. అడిగే వాడు ఎవడుంటాడులే అన్న రీతిలో ఉంటారు. ఇలాంటి విషయాలపై చిరంజీవి ద్వారా కొరటాల శివ కాస్త గట్టిగానే ప్రశ్నిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం మొదలుకానుందని తెలుస్తోంది.

అయితే కొరటాల శివ ఈ చిత్రం మొదలుపెట్టడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. భరత్ అనే నేను పూర్తైన తర్వాత కొరటాల శివను వెయిటింగ్ లోనే పెట్టాడు నిర్మాత రామ్ చరణ్. చిరంజీవి నటిస్తోన్న సైరా షూటింగ్ ఆలస్యం కావడంతో కొరటాల శివ మరొక సినిమా చేయకుండా తన దగ్గరే లాక్ చేసాడు. అన్నీ సజావుగా జరిగుంటే ఈపాటికి చిరంజీవి – కొరటాల శివ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయి ఉండేది. కానీ సైరా అనుకున్న దానికన్నా ఆరు నెలలు ఆలస్యమైంది. ఈలోగా అనుకుంటే కొరటాల శివ మరో సినిమా చేసుకునేవాడు. కానీ సైరా నిర్మాత రామ్ చరణ్ కొరటాల శివకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చి మరో మాట లేకుండా చేసాడు. ఆ ఆఫర్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ పూర్తైన తర్వాత నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే చేస్తానని మాటిచ్చాడు రామ్ చరణ్. నిర్మాత కూడా తన ఇష్టమని అన్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేసే సినిమా అంటే కచ్చితంగా బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇది కచ్చితంగా కొరటాల శివకు ప్లస్ అవుతుంది. పైగా నిర్మాత కూడా తన ఇష్టమంటున్నాడు కాబట్టి తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ చేతే ఈ చిత్రాన్ని నిర్మించేలా ఒప్పించాడట. ప్రస్తుతం చిరంజీవి చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులను ఓ కొలిక్కి తెచ్చిన కొరటాల శివ షూటింగ్ కు సమాయత్తమవుతున్నాడు. మేజర్ షూటింగ్ పార్ట్ ను సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్. అప్పటికి రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేస్తాడు కాబట్టి వెంటనే ఆ చిత్రం మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ లెక్కన మరో రెండు ఏళ్ళు మెగా ఫ్యామిలీకే అంకితమైపోతున్నాడు కొరటాల శివ.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PsP7Z6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...