అభిమానం డోస్ ఏ మాత్రం పెరిగినా సెలబ్రెటీలకు ఇబ్బందులు తప్పవు. ఒక మనిషి ఎలా ఉన్నా అతను అభిమాని అయితే చిన్న విషయాలకే మనసు ఫాస్ట్రాక్ లో రియాక్ట్ అవుతుంది. ఇక రీసెంట్ గా అలాంటి అభిమానుల కారణంగా ఒక మలయాళం హీరోయిన్ గాయలపాలైంది. ఆ దెబ్బకి హీరోయిన్ స్టేజిపైనే బోరున విలపించింది.
అసలు వివరాల్లోకి వెళితే.. ఓరు ఆధార్ లవ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నూరిన్ షరీఫ్ కమర్షియల్ యాడ్ ప్రమోషన్స్ కోసం ఇటీవల మంజేరిలోని ఒక సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి వచ్చింది. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు రెండు గంటల ముందే స్థావరనికి చేరుకున్నారు. అభిమానుల తాకిడిని ఈవెంట్ అధికారులు కంట్రోల్ చేయలేక సతమతమయ్యారు. అయితే కొందరు ఆగ్రహంతో నూరిన్ అనుకున్న సమయానికి రాకుండా ఆలస్యంగా వచ్చిందని నానా హంగామా చేశారు.
సాయంత్రం ఆరు గంటలకు వచ్చిన నూరిన్ ఎవరిని పట్టించుకోకుండా స్టేజ్ పైకి వెల్లసాగింది. అయితే ఇంతలో కొంతమంది ఆమె మీదకి ఎగబడ్డారు. ఆ హడావుడి జనంలో ఊహించని విదంగా ఓ ఫ్యాన్ చేయి నూరిన్ ముక్కుని తాకింది. వెంటనే ముక్కును పట్టుకున్న నూరిన్ దెబ్బ తాకింది అని ఏడ్చేసింది. స్టేజ్ పైకి ఎక్కినప్పటకి కొద్దిసేపటి వరకు ఆ గాయంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఈవెంట్ క్యాన్సల్ ఇవ్వడం కరెక్ట్ కాదని నెమ్మదిగా స్టేజ్ పైన ఈవెంట్ గురించి మాట్లాడింది. ఇక ఆమె ఏడుస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WsiWKL
Comments
Post a Comment