మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా కొనసాగుతోంది. ఆదివారంతో పోల్చుకుంటే కొంత డ్రాప్ ఉన్నా మరీ దారుణంగా ఏం పడిపోలేదు. నిన్నటితోనే 100 కోట్ల షేర్ సాధించిన సైరా, రంగస్థలం రికార్డులను కూడా అధిగమించి సూపర్ హిట్ స్టేటస్ సాధించే దిశగా వెళ్తోంది. ఇప్పటికే నైజాంలో 30 కోట్లు దాటిన సైరా ఉత్తరాంధ్రలో 15 కోట్లు, సీడెడ్ లో 20 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇంకా గోదావరి జిల్లాలు, నెల్లూరు, కృష్ణ వంటి ప్రాంతాల్లో సేఫ్ అవ్వాల్సి ఉంది.
అయితే ఇంకా దీపావళి వరకూ రన్ ఉంది కాబట్టి ఈజీగా తెలుగు వెర్షన్ వరకూ సైరా సూపర్ హిట్ స్టేటస్ సాధించే అవకాశాలున్నాయి. బయట మాత్రం సైరా డిజాస్టర్ స్టేటస్ ను అందుకోనుంది.
మొత్తంగా 13 రోజుల వరకూ సైరా కలెక్షన్స్ బ్రేక్ డౌన్
ప్రాంతం షేర్ (కోట్లలో)
నైజాం 31.43
సీడెడ్ 18.44
నెల్లూరు 4.38
కృష్ణ 7.25
గుంటూరు 9.39
వైజాగ్ 15.60
ఈస్ట్ 8.86
వెస్ట్ 6.35
మొత్తం 101.70
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35FQ4my
Comments
Post a Comment