బిగ్ బాస్ లో ఒకరిని టార్గెట్ చేసి ఆడటం అనేది సర్వ సాధారణం. కాకపోతే ఒక హౌస్ మేట్ బాగా ఆడినా కూడా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని గెలవనివ్వకపోవడం అనేది అసలు ఆమోదయోగ్యం కాదు. అయితే బిగ్ బాస్ లో టాస్క్ లు అన్నీ ఇలానే ఉంటాయి. ఒక హౌజ్ మేట్ ఎంత కష్టపడి గెలిచినా కూడా మిగతా సభ్యుల మద్దతు లేనిదే టాస్క్ లు గెలవడం చాలా కష్టం.
ఈ విషయం ఎవరికి అర్థమైనా కాకపోయినా బాబా భాస్కర్ కు నిన్న ఎపిసోడ్ లో బాగా బోధపడింది. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ మేడాలియన్ టాస్క్ లో వితిక అదే విధంగా గెలిచింది. తన గ్రూప్ హౌజ్ మేట్స్ వరుణ్, రాహుల్, పునర్నవికి తోడు అలీ కూడా బాబా భాస్కర్ కు వ్యతిరేకంగా ఉండడంతో బాబా భాస్కర్, వితికల మధ్య బాబా భాస్కర్ ఓడిపోవాల్సిన పరిస్థితి.
అలీ బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి హౌజ్ మేట్స్ నుండే కాక నాగార్జున కూడా బాబా భాస్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడడం.. తను ఎప్పుడూ కామెడీనే చేస్తున్నాడని విమర్శించడం వంటివి చేసాడు. దాంతో బాబా భాస్కర్ ను టార్గెట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి బాబా భాస్కర్ వీటిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ncpPCy
Comments
Post a Comment