Skip to main content

రౌడీ గారి ‘హీరో’ సినిమా ఆగిపోలేదు.

రౌడీ గారి 'హీరో' సినిమా ఆగిపోలేదు.
రౌడీ గారి ‘హీరో’ సినిమా ఆగిపోలేదు.

విజయ్ సాయి దేవరకొండ తెలుగు జనాలకి ‘రౌడీ’ గానే తెలుసు. ఎందుకంటే సినిమా ప్రచార సమయంలో ‘వాట్స్ అప్ మై రౌడీ ఫాన్స్’ అంటారు అలాగే ‘రౌడీ’ పేరిట ఒక బట్టల దుకాణం కంపెనీ ఉంది ఇంకా సినిమాలలో ఎక్కువగా తన బాడీ లాంగ్వేజ్ రౌడీ లాగానే ఉంటుంది కాబట్టి విజయ్ గారికి రౌడీ అనే పేరు అలా వచ్చేసింది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఒక హిట్టు సినిమా ఇస్తున్నాడు వెంటనే ఆ సినిమా తర్వాత గోరమైన ఫ్లాపు సినిమా ఇస్తున్నాడు.

ఇలా సగం సగం ఆనందాన్ని ఇస్తున్న రౌడీ గారి చేతిలో ఇప్పుడు దాదాపు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో మొదట విడుదల అయ్యేది ‘క్రాంతి మాధవ్’ దర్శకత్వంలో వస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఒకటి. ఇందులో ఏకంగా ముగ్గురు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడు మన రౌడీ గారు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫ్లాపు తర్వాత ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు రౌడీ గారి అభిమానులు. ఇక రెండవ సినిమా విషాయానికి వస్తే ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో ‘ఆనంద్ అన్నామలై’ దర్శకత్వంలో ‘హీరో’ అనే ఒక సినిమాకి పూజ కార్యక్రమాలు చేసారు.

‘పేట’ సినిమాలో రజనీకాంత్ గారికి చెల్లెలి పాత్ర చేసిన ‘మాళవిక మోహన్’ గారు ఈ సినిమాలో కథానాయిక. హీరో సినిమా ముహూర్తం షాట్ అయ్యిపోగానే కొద్దీ రోజులు సగం షూటింగ్ కూడా జరుపుకుంది. అనుకోకుండా హీరో సినిమా మధ్యలోనే షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదనే ఆ సినిమాని త్వరలోనే తిరిగి మొదలు పెట్టనున్నాము అని నిర్మాతలు ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. బైక్ రేసింగ్ నేపథ్యంలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అందుకు తగినట్లుగా ‘రజిని కృష్ణన్’ అనే ఒక అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ ని రంగం లోకి దింపి మన రౌడీ విజయ్ గారికి నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పిస్తున్నారు అని మీడియా వారు అనుకుంటున్నారు.

ఇక మూడవ సినిమా విషయానికి వస్తే ఇస్మార్ట్ డాషింగ్ డైరెక్టర్ ‘పూరి జగన్నాధ్‘ గారి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు గారి కథ అయిన ‘జనగణమన’ ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. నిర్మాతలుగా ‘ఛార్మి కౌర్’ గారు మరియు పూరి జగన్నాధ్ గారి కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లాగనే ఈ సినిమాని కూడా తీర్చి దిద్దాలని అనుకుంటున్నారు. పూరి జగన్నాధ్ గారు కథ, కథనం పని మీద కసరత్తులు చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గారికి కూడా లైన్ లో 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి పూరి జగన్నాధ్ గారి సినిమా కొంచెం సమయం తీసుకునేలాగానే ఉంది.

మరి ఒక హిట్టు సినిమా ఒక ఫ్లాపు సినిమా పరంగా చూసుకుంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హిట్టు, ‘హీరో’ సినిమా ఫ్లాపు, పూరి జగన్నాధ్ గారి ‘జనగణమన’ సినిమా హిట్టు అని ఇప్పటినుండే రౌడీ అభిమానులు ఒక పట్టిక రెడీ చేసుకుంటున్నారు. చూద్దాం మరి ఎలా జరగబోతుందో?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JaPvr3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...