రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. చూస్తుంటే ఈ సామెతను సినిమాలకు కూడా అన్వయించుకోవచ్చేమో. అప్పటిదాకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వారు తర్వాత కలిసి సినిమా చేయొచ్చు. అప్పటిదాకా హిట్ కాంబినేషన్ గా పేరు పడ్డ వారు తర్వాత ఒకరిని ఒకరు తిట్టుకోవచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు.
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. యాంకర్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ అర్జున్ రెడ్డి టైంలో బాగానే హడావిడి చేసింది. అందులో కొన్ని మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో విజయ్ మాటతీరుపై నిప్పులు చెరిగింది. అలాంటి మాటలు మీ ఇంట్లో మాట్లాడుకుంటారా అని తెగ ఫీల్ అయిపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా “మీకు మాత్రమే చెప్తా”లో ఒక కీలక పాత్రలో అనసూయ నటిస్తోంది.
అప్పుడు అంతలా విమర్శలు చేసారు కదా, ఇప్పుడు ఎలా కలిసి పని చేస్తున్నారు అని మీడియా అనసూయను ప్రశ్నించగా.. “అప్పటి విషయం నాపై కానీ విజయ్ పై కానీ ఎటువంటి ప్రభావం చూపించలేదు. అలా ఉండి ఉంటే ఈ పాత్ర నాకు ఆఫర్ చేసే వాళ్ళు కాదు. నాపై ప్రభావం పడి ఉంటే కొత్త బ్యానర్లలో సినిమాలు చేయకూడదన్న నా పాలసీకి విరుద్ధంగా ఇందులో పనిచేసేదాన్ని కూడా కాదు” అంటూ కవరింగ్ ఇచ్చుకుంది అనసూయ.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OTiROo
Comments
Post a Comment