జనరల్ గా అభిమానులు ఏ హీరోనైనా ఆ పాత్రలో చూడాలి, ఈ పాత్రలో చూడాలి అని అనుకుంటారు. సూపర్ స్టార్ ‘రజనీకాంత్‘ గారి అభిమానులు కూడా ఆయన్ని అన్ని పాత్రల్లో చూడాలి అని అనుకోకుండా ఉండగలరా? అందుకే అభిమానుల కోసం ఆయన ఏ పాత్ర అయినా కథకి అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు.
మరి అభిమానుల కోసం ఏమైనా చేసే రజనీకాంత్ గారు వారి కోసం ఏం చేసుకుంటారు అంటే దైవారాధన తప్ప ఇంకేం ఆలోచన లేవు అని సులువుగా బదులు ఇచ్చేస్తారు. ఏడాదికి ఒకసారి సమయం దొరికినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా దైవారాధన చేసుకొని చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసుకొని తీరిగ్గా వస్తారు.
మరి ఆ విషయం ఇప్పుడు ఎందుకు అంటే..ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్‘ సినిమాని మొదలు పెట్టిన రజనీకాంత్ గారు తన వంతు షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు. డబ్బింగ్ పనులు తప్ప ఇంకేం బాధ్యతలు లేవు రజనీకాంత్ గారికి. అలా దర్బార్ సినిమా షూటింగ్ అయిపోయిందో లేదో వెంటనే ఇంకొక సినిమాని కూడా లైన్ లో పెట్టేసారు. వీరం, వేదలమ్, వివేకం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన ‘శివ’ గారి దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నా సమయంలో వారి పని ఒత్తిడి గురించి మర్చిపోతున్నారు. ఆరోగ్యం దెబ్బ తినకుండా ఒకసారి హిమాలయాలకి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నారంటా. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాతనే వారి తదుపరి సినిమా గురించి ఆలోచించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో ‘శివ’ గారు డైరెక్ట్ చేయబోయే సినిమా రజనీకాంత్ గారి హిమాలయాల పర్యటన తర్వాత మొదలు కాబోతుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31cVNg6
Comments
Post a Comment