ప్రస్తుతం చిరంజీవి ఫుల్ జోష్ మీదున్నాడు. సైరా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే సైరా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తాను చరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ అప్డేట్ అటు మెగా అభిమానులకే కాక సినీ ప్రేక్షకులందరికీ ఆనందాన్నిచ్చింది. వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద మగధీర, బ్రూస్ లీ చిత్రాలలో కొద్ది నిముషాలు కనిపిస్తేనే థియేటర్లు హోరెత్తిపోయాయి.
మరి ఇద్దరూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్నారంటే అది నిజంగా అందరికీ థ్రిల్ నిచ్చే అంశం. అయితే దీనిపై భిన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవి, చరణ్ కలిసి నటించే సినిమా మలయాళ సినిమా లూసిఫెర్ కు రీమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇటీవలే ఈ చిత్ర హక్కులు చిరు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీ రాజ్ పోషించిన పాత్రను ఇక్కడ చరణ్ చేస్తారట.
మరో వార్త ఏమిటంటే చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ పాత్ర ఉంటుందిట. దాదాపు ఒక 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని చెప్తున్నారు. ఇందులోనే చిరంజీవి, చరణ్ కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31Xsn6J
Comments
Post a Comment