సినీ ఇండస్ట్రీలో మొదటి అడుగు అనేది చాలా ముఖ్యం. అది సరిగ్గా వేయకపోతే దాన్నుండి కెరీర్ ను నిర్మించుకోవడం అనేది కష్టతరంగా మారుతుంది. కెరీర్ మొదట్లో ఎలాంటి పాత్రలొచ్చి పేరొస్తుందో, అలాంటివే మళ్ళీ మళ్ళీ ఆఫర్ చేస్తుంటారు. చాలా మంది చేసేదేం లేక అలాంటి పాత్రలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా మంది వందల కొద్దీ నర్స్ వేషం, టీచర్ వేషం వంటివి వేసిన వారు ఉన్నారు.
తమిళ బిగ్ బాస్ లో పాల్గొని పేరు తెచ్చుకున్న యాషిక తమిళంలో తన మొదటి సినిమా ఇఱుట్టు అఱైయుల్ మురట్టు కుత్తు అనే సెక్స్ కామెడీ హారర్ లో నటించింది. అదే చిత్రం తెలుగులో చీకటి గదిలో చితకొట్టుడు పేరుతో రీమేక్ అవ్వగా అందులో కూడా ఈ భామ హాట్ వేషాలేసింది.
ఇక అంతే.. ఈ అమ్మడికి అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయట. అందరూ ఇవే తరహా ఆఫర్లతో ముందుకు వస్తుండడంతో సినిమాలు కూడా సైన్ చేయడం మానేసిందని యాషిక స్వయంగా చెప్పుకుంది. సినిమాలో ఒక పాత్ర చేస్తే వరసగా అలాంటి పాత్రలే ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదని ఈ భామ వాపోయింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2oKVmfm
Comments
Post a Comment