Skip to main content

పవన్ రీ ఎంట్రీకి దిల్ రాజు స్కెచ్ అదిరిందిగా

పవన్ రీ ఎంట్రీకి దిల్ రాజు స్కెచ్ అదిరిందిగా
పవన్ రీ ఎంట్రీకి దిల్ రాజు స్కెచ్ అదిరిందిగా

గత కొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిరిగి సినిమాల్లోకి రప్పించాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాజకీయంగా పవన్ కు స్తబ్దత ఉండడంతో దాన్ని సినిమా వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లోకి రావాలని అనిపిస్తున్నా తనను మళ్ళీ రాజకీయంగా లైట్ తీసుకుంటారేమో అని భయపడుతున్నాడు. అందుకే ఎంత మంది సినిమా కథలతో వచ్చినా చేయనని చెప్పట్లేదు, చేస్తానని మాటివ్వట్లేదు. చూద్దాం అన్నట్టుగానే ఉంది పవన్ పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయితే ఈ విషయాన్ని అసలు లైట్ తీసుకోవట్లేదు. పవన్ తో ఇప్పటిదాకా సినిమా నిర్మించని దిల్ రాజుకు ఇదే మంచి అవకాశం. ఇప్పుడు మిస్ అయితే పవన్ మళ్ళీ దొరక్కపోవచ్చు. అందుకే పవన్ ను మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావడానికి సూపర్ స్కెచ్ వేసాడు. బాలీవుడ్ లో రీమేక్ అయిన పింక్ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమాను పవన్ కు కూడా చూపించాడు. తనకి కూడా నచ్చింది. అయితే మళ్ళీ అదే ఆలోచన. ఇప్పుడు సినిమాల్లోకి రావడం కరెక్టేనా?

నిజానికి పవన్ పింక్ రీమేక్ వైపు పాజిటివ్ గానే ఉన్నాడు. పింక్ కాకుండా కొన్ని కథలు విన్నా కూడా పింక్ తనకు ఈ టైంలో బెస్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ సినిమా చేయడానికి దిల్ రాజు కేవలం 25 రోజుల కాల్ షీట్స్ అడిగాడు. అది కూడా ఒకేసారి అవసరం లేదు. పవన్ పార్ట్ రెండు షెడ్యూల్స్ లో షూట్ చేయడానికి ప్రపోజల్ ఇచ్చాడు. ప్లస్ ప్రమోషన్స్ కు ఒక రెండు, మూడు రోజులు కావాలి. అదే వేరే సినిమా అయితే పవన్ 60 నుండి 70 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలి. పైగా వాటిలో ఫైట్స్, సాంగ్స్, డ్యాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. పింక్ చిత్రంలో పవన్ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాక్టింగ్ అంతే.

సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని పవన్.. దిల్ రాజు ప్రపోజల్ కు ఓకే చెప్పేద్దామని అనుకుంటున్నాడు. రాజకీయాల్లో మళ్ళీ ఇబ్బంది తలెత్తుతుందన్న ఆలోచన తప్పితే పింక్ రీమేక్ కు పవన్ సుముఖమే. సో, దిల్ రాజు మరో మీటింగ్ లో ఈ విషయం ఫైనల్ చేసేద్దామని అనుకుంటున్నాడు. అన్నీ సజావుగా సాగితే పవన్ రీ ఎంట్రీ వచ్చే ఏడాది మొదట్లోనే ఉండే అవకాశముంది. పవన్ ప్రస్తుతం వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెల్సిందే. మళ్ళీ నటిస్తే ఈ నొప్పి మరింత పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి పవన్ ఈలోగా వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటాడట. సో, దిల్ రాజు నిర్మాణంలో పవన్ రీ ఎంట్రీ దాదాపు ఖాయం. పవన్ ఫ్యాన్స్ చూస్తున్నారా!



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ByYj5M

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...