Skip to main content

నమ్మేవాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వెంటనే వింటారు

నమ్మేవాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వెంటనే వింటారు
నమ్మేవాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వెంటనే వింటారు

బుల్లితెర సీరియల్స్ ని మనం అస్సలు పట్టించుకోము. కారణం చూపించిన వాటిని చూపించి, చూపించి సీరియల్ మీద విరక్తి పుట్టిస్తారు. ఇక సీరియల్ లో వారి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ మధ్య టిక్ టాక్ వారు అయినా మంచిగా నటన చేస్తున్నారు కానీ ఈ సీరియల్స్ వారికి మాత్రం నటన గురించి అవగాహన లేకుండా ఎడాపెడా నటిస్తున్నారు. అందుకే కొన్ని వేల సంఖ్యలో సీరియల్స్ ఉన్నప్పటికీ అందులో రెండో, మూడో నెగ్గుకొస్తున్నాయి.

ఒకప్పుడు ఎండమావులు, అన్వేషిత, మొగలి రేకులు లాంటి సీరియల్స్ బాగా ఆదరణ పొందాయి. ఇప్పుడు చూసుకుంటే ఒకే ఒక్క సీరియల్ అటు టీవీ లో, మాధ్యమాల్లో బాగా ఆదరణ పొందుతుంది. ఆ సీరియల్ పేరు ‘కార్తీక దీపం’. యువత, మధ్య వయస్సు కలవారు, ఆడ, మగ, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కలు ఆ సీరియల్ వచ్చే సమయానికి టీవీ ల ముందు కూర్చుంటున్నారు. ఆ సీరియల్ కి అంత బాగా పాపులర్ రావడానికి కారణం ‘ప్రేమి విశ్వనాధ్’ గారి వంటలక్క పాత్ర. ఆమె ఒక్కదాని మూలానా రోజు రోజుకి జనాల దగ్గరికి వెళ్లిపోతుంది కార్తీక దీపం సీరియల్ పాపులారిటీ.

ఆ సీరియల్ లో నటించే హీరో పాత్ర అనగా ‘నిరుపమ్ పరిటాల’ గారు మొన్న జరిగిన ‘మా పరివార్ అవార్డు’ వేడుకల్లో ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావించారు. ఆయన మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే ‘కార్తీక దీపం సీరియల్ లో నా నటన చూసిన పవన్ కళ్యాణ్ గారి అమ్మ ‘అంజనా దేవి‘ గారు బహుమతిగా మామిడి కాయలు పంపించారు.’ అని అన్నారు. ఇక అంతే అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడగానే అభిమానులు ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు తెగ గొడవచేసారు.

ఇప్పటికే కార్తీక దీపం సీరియల్ కి అంత పేరు వచ్చినా కూడా ఇంకా పేరు రావాలి అని చెప్పి నిరుపమ్ గారు కావాలని ‘పవన్ కళ్యాణ్‘ గారి పేరు ఇప్పుడు చెప్పడం వెనకాల పెద్ద మైండ్ గేమ్ ఎదో ఉంది అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడో వేసవి కాలంలో పండే మామిడి కాయల గురించి అవి పంపిన పవన్ కళ్యాణ్ అమ్మ గారు గురించి ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే జనాలు వారికి, వారి సీరియల్ కి మద్దతు ఇస్తారు అని ఇలా చేసుండొచ్చు అని అనుకుంటున్నారు కొంతమంది.

సరేలే బాగా పాపులారిటీ వచ్చిన సీరియల్ కి ఇలాంటివి చేయడం, చెప్పుకోవడం మూలాన చాలామందికి విసుగు వస్తుందని, అలా విసుగు వచ్చిన వారికి మీరు పరిశ్రమ పెద్ద వాళ్ళని లాగడం వలన మీకే ఇబ్బంది అని మాద్యమాల్లో తెగ అల్లరి చేస్తుంది ఈ వార్త. మేము మరీ అంత పవన్ కళ్యాణ్ భక్తులము అయినప్పటికీ ఎవరికీ ఇచ్చే మర్యాద  వారికి ఇస్తాము. ఇప్పటికీ చాలా మంది మా పవన్ కళ్యాణ్ బాబు గారి పేరు చెప్పుకొని బయటికి మంచివారి లాగా లోపల ఇంకో రకంగా ఉంటున్నారు. నిరుపమ్ బాబు నువ్వు చెప్పిన మాట నిజమో? లేదో? తెలీదు కానీ చెప్పాల్సిన సమయంలో  చెప్పకుండా అనవసరమైన సందర్బంలో చెపితే ఇలాగే ఉంటుంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆవేధన.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2N5DNiq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...