Skip to main content

కథానాయకుడు అంటే కమర్షియల్ సినిమాలు కూడా చెయ్యాలి

జోరుమీదున్న విష్ణు...
జోరుమీదున్న విష్ణు…

హీరో ‘శ్రీ విష్ణు‘ గురించి ఈ రోజు తెలుగు సినిమా దర్శకులు, కుర్ర హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద స్టార్ హీరోలు మాట్లాడుకుంటున్నారంటే అతని కథల సెలక్షన్ తీరు మంచిది కాబట్టి. నిజంగానే ఎంచుకునే ప్రతి పాత్రకి న్యాయం చేస్తున్నాడు. సినిమాని విమర్శకుల దగ్గర నుండి అందరికి నచ్చేలా చేస్తున్నాడు.

చూసుకుంటే మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ప్రతినిధి, అలాగే ఈ సంవత్సరం ‘బ్రోచేవారెవరురా‘ సినిమాలు శ్రీ విష్ణు పవర్ ఏంటో చూపించాయి. మధ్యలో మా అబ్బాయి, వీర భోగ వసంత రాయలు సినిమాలు బోల్తా కొట్టినా వెంటనే అలెర్ట్ అయిపోయి తర్వాతి సినిమాలా మీద కసరత్తు చేసేవారు.

అందుకే శ్రీ విష్ణు కి, మిగిలిన కుర్ర హీరోలకి ఇది తేడా అని ఉదాహరణగా చూపించొచ్చు. ఇప్పుడు శ్రీ విష్ణు కమర్షియల్ సినిమాల మీద మొగ్గు చూపిస్తున్నారు అంటున్నారు అతని సన్నిహితులు. ‘తిప్పరా మీసం‘ అని కొత్త సినిమా చేస్తున్న శ్రీ విష్ణు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసాడు. ట్రైలర్ చాలా బాగుంది. శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకాన్ని మళ్ళీ నిజం చేస్తాడు అని ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు. సినిమాకి దర్శకుడు కృష్ణ విజయ్. నిక్కీ తంబోలి హీరోయిన్, సురేష్ బొబ్బిలి సంగీత దర్శకులు.

ఇక తిప్పరా మీసం సినిమా షూటింగ్ పార్ట్ ముగుస్తుంది అనగా ఇంకొక సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో నటించనున్న ఈ సినిమాలో విష్ణు మొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నారు. సినిమాకి సంగీతం మెలోడీ బ్రహ్మ ‘మణిశర్మ‘ గారు.

నిర్మాతల వివరాలు మరియు మిగిలిన తారాగణం లాంటి విషయాలన్నీ తొందరలోనే ప్రకటిస్తాం అని ప్రదీప్ వర్మ గారు తెలిపారు. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు జరుపుకున్న సినిమా డిసెంబర్ నుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల అయ్యేలా చూసుకుంటున్నారు. మొదటి సారి కమర్షియల్ బాట పట్టిన శ్రీ విష్ణుకి కథ మీద పూర్తి నమ్మకం ఉంది అంటున్నారు అతని సన్నిహితులు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/315BzEZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...