లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి వెండితెరపై మెరవనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం కోసం విజయశాంతి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
కథ ప్రకారం ఈ చిత్రం కర్నూల్ టౌన్ లో జరగాల్సి ఉన్నా విజయశాంతి హైదరాబాద్ లో షూటింగ్ అయితేనే వస్తాను అనడంతో హైదరాబాద్ లో సెట్ వేయక తప్పని పరిస్థితి. అనిల్ రావిపూడి ఏమాత్రం సంశయించకుండా తోట ఉండే ఇంటి సెట్ ను హైదరాబాద్ లోనే వేయించాడట. ఒక దర్శకుడు తనకు ఇంత కంఫర్ట్ ఇస్తుండడంతో విజయశాంతి అనిల్ రావిపూడికి ఫిదా అయిందని సమాచారం.
వెంటనే అనిల్ రావిపూడి తర్వాతి చిత్రం ఎఫ్ 3 లో కూడా విజయశాంతి చేయడానికి ఒప్పుకుందట. సరిలేరు నీకెవ్వరు తర్వాత చిరంజీవి – కొరటాల శివ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2o2GQiY
Comments
Post a Comment