బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి బోల్డ్ బ్యూటీగా ఇండస్ట్రీలో పేరుంది. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం కంగనా స్పెషలిటీ. గతంలో మీటూ ఉద్యమమప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన కంగనా, తనను ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు వాడుకున్న విషయాన్ని కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. వారి పేర్లు కూడా బయటపెట్టింది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగనా తన తొలి ముద్దు అనుభవం గురించి వివరించింది. తన పదిహేడేళ్ల వయసులో తొలి ముద్దు అనుభవం పొందినట్లు ఆమె చెప్పింది. అప్పట్లో తాను చండీగఢ్ లో ఉండే సమయంలో ఒక క్యూట్ పంజాబీ యువకుడితో డేటింగ్ లో ఉండేదాన్నని.. తనని ముద్దు పెట్టుకోవడానికి ముందు ప్రాక్టీస్ కూడా చేసుకున్నానని ఆమె అంది.
“నా చేతిని నేనే ముద్దు పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళా. అయితే ముద్దు పెట్టుకునే సమయంలో మాత్రం అంత గొప్పగా రాలేదు. అది మ్యాజికల్ కాదు, అదో చెత్త” అని కంగనా వ్యాఖ్యానించింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pE5Duk
Comments
Post a Comment