తెలుగు సినిమా మార్పు కోరుకుంటుంది. ఒకానొక స్టేజి లో సినిమాలో యుద్దాలు, పెద్ద పెద్ద అరుపులు, బాంబు పేలుళ్లు, హీరోయిన్ వాళ్ళతో రొమాన్స్ పాటలు అన్ని ఉండేవి. ఎన్ని ఉన్న కూడా సినిమా హిట్ అయితేనే వాటికి పేర్లు దక్కుతాయి లేదంటే సినిమా ఇంటికి పోవాల్సిందే.
అయితే తెలుగు సినిమాలోని పెద్ద స్టార్ హీరోలకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే కథ మొత్తం విని నచ్చితేనే ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. ఒకవేల డేట్స్ కాలి లేక దర్శకుడితో చేయలేకపోతే కొన్ని రోజులు ఆగమని చెప్తారు. కథ మొత్తం నచ్చి అందులో కొన్ని సీన్స్ నచ్చకపోయినా కూడా చేప్పేసే హక్కు స్టార్ హీరోలకి ఉంటది. దాన్ని ఏ దర్శకుడు తప్పు పట్టలేరు. అలా హీరోలు అనడం తప్పు అని దర్శకులు అనుకుంటే హీరోకి ఫ్లాప్ పడిన రోజులు కూడా ఉన్నాయి.
సరిగ్గా దర్శకుడు సుకుమార్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మహేష్ బాబు కి స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక కథ చెప్పాడు, కథ నచ్చింది అని చెప్పడంతో పాటు కథలో కీలకమైన సన్నివేశాలు మార్చమని చెప్పారు మహేష్ గారు. తీరా చూస్తే వెంటనే మహేష్ బాబు గారు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా మొదలు పెట్టేసారు. ఎందుకంటే మహేష్ బాబుని నమ్ముకొని చాలా మంది దర్శకులు ఉంటారు కాబట్టి.
సుకుమార్ గారికి సారి చెపుతూ ట్వీట్ కూడా చేసేసారు మహేష్ బాబు, ఎందుకంటే కొంతమంది నెటిజన్లు మహేష్-సుకుమార్ మీద తప్పుడు ప్రచారం జరగవచ్చు కాబట్టి మహేష్ బాబు బాగా అలోచించి అలా చేసారు. తర్వాత ఆ కథ ‘అల్లు అర్జున్’ దగ్గరికి వచ్చింది సుకుమార్ ఏమో అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
అల్లు అర్జున్ గారేమో ఒక పక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న ‘అలా వైకుంఠపురములో’ అనే సినిమా బిజీ లో ఉన్నారు. ఇంకొక సినిమా ‘ఐకాన్ కనపడుటలేదు ‘ అని వేణు శ్రీరామ్ దర్శకులు చెప్పిన కథ కూడా అల్లు అర్జున్ కి నచ్చింది. అల్లు అర్జున్ మరి తన తరువాతి సినిమా గురించి బాగా ఆలోచిస్తూ కథ మీద ఇంకా బాగా గ్రిప్ తెచ్చుకొమ్మని చెప్పాడంటా…..లేదంటే నేను ఐకాన్ సినిమాని మొదలు పెడుతా అని సుకుమార్ కి తన తరపు వాదన వివరించారు…ఇలా ఇద్దరు హీరోలు సుకుమార్ కి చెప్పిన మాటలు సుకుమార్ ని బాధ పెట్టాయి అని అంటున్నారు సినిమా వర్గాల వాళ్ళు. ఇందులో ఎంత నిజం ఉందొ? లేదో అన్నది సుకుమార్-అల్లు అర్జున్ సినిమా మొదలు అయ్యేదాకా తేలేలా లేదు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ny905c
Comments
Post a Comment