తమిళ తంబిలకు ఇష్టమైన నటుడు స్టార్ హీరో తల ‘అజిత్‘. తెలుగువారికి కూడా సుపరిచితుడే కానీ గత సినిమాలు చూసుకుంటే నటన పరంగా ఏమి తేడా లేకపోయినా అతని తెల్ల మీసం, గడ్డం, జుట్టు ఇలా మూడు మన తెలుగు వారికి మైనస్ లాగ అనిపించాయి. అందుకే అలా విపరీతమైన గెట్ అప్ లో చూడలేక ఇబ్బంది పడ్డారు.
అప్పుడెప్పుడో “గ్యాంబ్లర్” సినిమాలో చూసిన అజిత్ గెట్ అప్ ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతున్న కూడా చూడలేకపోయాము. కారణం వరుసగా మాస్ సినిమాలు రావడం, కథ కి తగ్గట్టుగా అదే గెట్ అప్ అనే సరికి మన అజిత్ కూడా అలానే ఉండేవారు. మొన్న రిలీజ్ అయినా “నెర్కొండ పార్వై” సినిమాలో కూడా లాయర్ వృత్తిలో కూడా అదే గెట్ అప్ చూసేసాం. సినిమా కూడా బాగా ఆడింది తమిళంలో. తెలుగులో ఇంకా రిలీజ్ చేయలేదు.
తమిళ తంబిలకు ఆ గెట్ అప్ అంటే ఇష్టం కానీ మనకి అంతగా గిట్టుబాటు అవ్వని ఆ గెట్ అప్ కి ఇంకా ఎప్పుడు స్వస్తి చెపుతారో అనుకున్న వారికి ఇప్పుడు చెప్పే వార్త తీపి కబురు. అవును ఇప్పుడు 60 వ సినిమాగా తెరకెక్కబోతున్న అజిత్ సినిమాలో గడ్డం తీసేసి నల్ల జుట్టుతో అందంగా ‘గ్యాంబ్లర్’ సినిమాలో లాగ చక్కగా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఈ గెట్ అప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అజిత్ గారు మాస్ మరియు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ రోల్ లో పోలీసు అధికారిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కనుక తెలుగులో మంచి పేరు సంబదిస్తే అజిత్ కి ఉన్న మంచి పేరు మరింత పెరగబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31U57Xa
Comments
Post a Comment