మహేష్ విట్టా.. యూట్యూబ్ లో వీడియోలు చేసుకునే ఈ కామెడీ నటుడు, ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించాడు. బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యేసమయానికి ఇతను ఎవరనేది ప్రేక్షకులకు పెద్దగా ఐడియా లేదు. అయినా కానీ మహేష్ 12 వారాలు బిగ్ బాస్ లో సర్వైవ్ అయ్యాడు. హిమజ, పునర్నవి, అలీ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారే కానీ వారితో పాటు నామినేషన్స్ లో ఉన్న మహేష్ మాత్రం సేవ్ అవుతూ వచ్చాడు.
దాదాపు ప్రతీ వారం నామినేట్ అవుతున్న మహేష్ ఈసారి కూడా సేవ్ అవుతాడా అంటే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి. ఓటింగ్ సరళి చూస్తే కూడా క్లారిటీ రావట్లేదు. అటు రాహుల్, మహేష్ కు పోటాపోటీగా ఓట్లు పడుతున్నాయి. వరుణ్ వీరిద్దరి కంటే ముందున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్, రాహుల్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం కష్టంగా ఉంది.
మహేష్ కు రాయలసీమ ప్రజల నుండి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. రాహుల్ కు ఏమో హైదరాబాద్ వాసులు ఓట్లు గుద్దుతున్నారు. ఈ వారం కూడా మహేష్ సేవ్ అవ్వగలిగితే ఇక అతణ్ణి ఫైనల్ కు వెళ్లకుండా ఆపడం చాలా కష్టం. మరి బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఆసక్తికరంగా మారింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OCvRYz
Comments
Post a Comment