నిర్మాతగా దిల్ రాజు అత్యధిక సక్సెస్ లు అందుకున్న వ్యక్తి. కచ్చితమైన తన లెక్కలతో నిర్మాతగా అంచలంచలుగా ఎదిగి ఇవాళ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడిగా నిలిచాడు. దిల్ రాజు ఎంత పెద్ద నిర్మాత ఐనా కూడా చిన్న సినిమాలను వదల్లేదు. ఇన్నేళ్ల తన కెరీర్ లో చిన్న సినిమాలకు అండగా ఉంటూనే పెద్ద సినిమాలను తెరకెక్కించాడు దిల్ రాజు.
అయితే ఈసారి రెండు చిన్న సినిమాలను కొన్ని రోజుల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాడు. ఆ చిత్రాలే “ఎవరికీ చెప్పొద్దు”, “ఆవిరి”. ఈ చిత్రాలకి వేరే వేరే నిర్మాతలైనా కూడా దిల్ రాజు వీటిని ఓన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నాడు. లాభాలేమైనా వస్తే అప్పుడు పంచుకుంటారన్నమాట. ఈ విధమైన ఫైనాన్సియల్ సపోర్ట్ చిన్న నిర్మాతలకు ఎంతో అవసరం.
ఎవరికీ చెప్పొద్దు ఈరోజు విడుదలవుతోంది. కాస్ట్ ఫీలింగ్ ను ప్రధానాంశంగా చేసుకుని తీసిన చిత్రమిది. ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ప్రమోషన్స్ కూడా బాగా చేసారు. పండగ సెలవుల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరోవైపు రవిబాబు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ఆవిరి కూడా అక్టోబరు 13న విడుదల కానుంది. ఈ చిత్రంతోనైనా రవిబాబు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కగలడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ రెండు సినిమాలు సక్సెస్ కావడం దిల్ రాజుకు మరింత ప్రధానం. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయడానికి తనకు ధైర్యాన్నిస్తుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Iy1sXx
Comments
Post a Comment