మనం అనుకుంటాం కానీ కమర్షియల్ సినిమాలు తీయడం అంత ఈజీ ఏం కాదు. అందులోనూ ఒక స్టార్ హీరోను పెట్టి సరైన కమర్షియల్ సినిమా తీయాలంటే ఆ దర్శకుడికి తలకు మించిన భారమే. మాములుగా ఒక స్టార్ హీరోని పెట్టి కమర్షియల్ సినిమా తీయడమే కష్టమంటే అందులో విలువలను జోడించి, సమాజానికి ఏదో చెప్పాలనే తాపత్రయం కూడా ఉంటే అది సాహసమే అవుతుంది.
ఆ సాహసాన్ని కొరటాల శివ విజయవంతంగా నాలుగు సినిమాలుగా చేస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా ప్రతీ సినిమాలోనూ ఏదొక మెసేజ్ ను అందిస్తూ వచ్చిన కొరటాల శివ ఇప్పుడు చిరంజీవితో చేయబోయే చిత్రంలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాడు.
ఎండోమెంట్ డిపార్మెంట్ లో జరిగే అవినీతి, దేవాలయాలను ఎలా నిర్లక్ష్యం చేసుకుంటున్నాం, రాజకీయ నాయకులు దేవాదాయ భూములను ఆక్రమించుకోవడం.. ఇలా అందులో జరిగే అవినీతినంతా తన సినిమా ద్వారా ప్రశ్నించనున్నాడు కొరటాల శివ. సినిమా లైన్ ఎంతో ఆసక్తికరంగా ఉండగా మరి సినిమా కూడా అలానే ఉంటుందా లేదా అన్నది చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Mi3qh5
Comments
Post a Comment