గత కొన్ని రోజులుగా రానా ఆరోగ్యం గురించి వివిధ మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, ఎవరికి తోచినట్లు వారు తనకు ఆరోగ్యం బాలేదని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రానా అమెరికా వెళ్లాడని వార్తలు రాసారు. రానా అమెరికా వెళ్లిన మాట నిజమే కానీ ఎందుకు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. దానికి తోడు రానా బాగా బక్కచిక్కిపోయి కనిపించాడు. ముఖంలో కూడా కళ మిస్ అయింది. దాంతో రానా అనారోగ్యం గురించి వార్తలను జనం నమ్మడం మొదలుపెట్టారు.
అమెరికా నుండి తిరిగివచ్చాక కూడా రానా హైదరాబాద్ రాకుండా ముంబై వెళ్ళాడు. దీనికి కూడా కారణం తెలీదు. అయితే ఇది కూడా ట్రీట్మెంట్ కోసమే అని మీడియా కథనాలు ప్రసారం చేసింది. మొత్తానికి రానా ఆరోగ్యంపై పలువురు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. వార్తలు కూడా హద్దు మీరుతుండడంతో సురేష్ బాబు మొత్తానికి క్లారిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
మీడియాలో కథనాలు వస్తున్నట్లు రానా ఏం కిడ్నీ సమస్యలతో బాధపడట్లేదని, తను ఆరోగ్యంగా ఉన్నాడని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. “చిన్నప్పటి నుండి రానాకు కంటి సమస్య ఉంది. అయితే చిన్నవాడు కావడంతో అప్పుడు చేయకూడదన్నారు వైద్యులు. దానికి చికిత్స ఈ మధ్యనే జరిగింది. అందుకే రానా హైదరాబాద్ లో లేడు” అని క్లారిటీ ఇచ్చారు సురేష్ బాబు. ఈ ఇచ్చేదేదో ముందరే ఇచ్చి ఉంటే జనాలకు కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా!
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VLVasw
Comments
Post a Comment