స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఒకే రోజు విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఎంత డిస్కషన్స్ అయినా కానీ రెండు చిత్రాలూ తగ్గకపోవడంతో జనవరి 12కే రానున్నారు. ఇద్దరిలో ఒకరు ఒక రోజు ముందు వస్తే ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది అన్నా కూడా ఎవరూ తగ్గడానికి ఇష్టపడకపోవడంతో ఒకేరోజు రాక తప్పేలా లేరు.
రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో రెండు చిత్రాలూ ప్రకటించారు. కాకపోతే ప్రమోషన్స్ విషయంలో అల వైకుంఠపురములో టీమ్ చాలా ముందుంది. ఇప్పటికే “సామజవరగమన” పాట విడుదల చేయగా.. అది మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్ గా రికార్డ్ సృష్టించింది. ఈ పాట ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతోంది. ఇదే అనుకుంటే ఈరోజు సెకండ్ సాంగ్ “రాములో రాముల” వీడియో సాంగ్ టీజర్ ను కూడా విడుదల చేస్తున్నారు.
ఇంతే కాకుండా నాలుగైదు రోజులకొక పోస్టర్ వదులుతూ ప్రతి పోస్టర్ లోనూ జనవరి 12న విడుదల అంటూ వేయడం సరిలేరు నీకెవ్వరు టీమ్ కు టెన్షన్ పెంచుతోంది. ప్రమోషన్స్ విషయంలో వెనకపడ్డ సరిలేరు నీకెవ్వరు మాత్రం షూటింగ్ విషయంలో ముందుంది. షూటింగ్ మొత్తం పూర్తవ్వడానికి ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే ఉంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఒకేసారి ప్రమోషన్స్ ను దంచి కొడతారేమో.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BwZ9Ae
Comments
Post a Comment