మెగాస్టార్ చిరంజీవి గారికి సినిమాలా మీద ఉన్న ప్రేమ అమితమైనది. అందుకే రాజకీయాలలో విఫలం అయిన వెంటనే తిరిగి వచ్చి యధావిధిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తన పూర్వ వైభవం లాగానే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ బాగుంటే రీమేక్ చేయడానికి కూడా ఒకే అంటున్నారు మిగిలిన బాష కథలను కూడా.
150 వ సినిమాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘కత్తి’ సినిమాని రీమేక్ చేసి మెగాస్టార్ స్టైల్ లో “ఖైదీనంబర్ 150” సినిమాగా తీసి హిట్ కొట్టారు. మొన్న ‘సురేందర్ రెడ్డి’ దర్శకత్వంలో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో బాహుబలి తర్వాత తెలుగు సినిమా కీర్తిని పెంచేశారు. నిన్న 151 సినిమాగా ‘కొరటాల శివ’ దర్శకుడికి అవకాశం ఇచ్చేసారు. కొరటాల శివ గారు చెప్పిన కథ నచ్చడం, పైగా ఏ కథనైనా దానిలో గొప్పగా మెసేజ్ అందించడం శివ గారికి కొట్టిన పిండి అని తెలిసిన విద్య అని ఛాన్స్ ఇచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి గారు.
ఇప్పుడు ఏకంగా లెక్కల మాస్టర్ నుండి దర్శకుడిగా మారిన ‘సుకుమార్’ గారికి తన 153 సినిమాకి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మాట అని వార్త ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతుంది. మరి ఆ సినిమా మలయాళం ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ అని, ఆ కథని సుకుమార్ స్టైల్ లో తెరకెక్కిస్తారని అంటున్నారు. ఒకవేళ ఆ కథ కుదరకపోతే మహేష్ బాబు, అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిన స్ముగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అయిన మెగాస్టార్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా ఆ కథ మీద పెద్దగా ఇంటరెస్ట్ చూపియ్యడం లేదు, తాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్ కనపడుట’ లేదు సినిమాని మొదట స్టార్ట్ చేస్తారు అని అల్లు అర్జున్ తరపు సన్నిహితులు చెపుతున్నారు. ఇక మహేష్ బాబు, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఆ కథని మెగాస్టార్ తో తీయిస్తే సుకుమార్ రేంజ్ పెరగటం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2B6oiRV
Comments
Post a Comment