‘అందాల రాక్షసి’ సినిమా తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టినా కూడా ఆ సినిమాలో నటించిన నటినటులందరికి మంచి పేరు దక్కింది. ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి కి గొంతు అందించిన ‘చిన్మయి శ్రీపాద’ మరియు సినిమాలో నటించిన ఇద్దరు హీరోలో ఒకరైనా ‘రాహుల్ రవీంద్రన్’ ఇద్దరు ఈ సినిమా తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే చిన్మయి శ్రీపాద ఎక్కువగా తన గొంతు ‘సమంత అక్కినేని’ గారికి అందించడం చూసాం….చిన్మయి మంచి గాయని కూడా, ఇక ఇన్ని లక్షణాలు ఉన్న చిన్మయి అప్పుడప్పుడు ‘స్త్రీవాదం’ గురించి ట్విట్టర్ వేదికగా చేసుకొని చాల సమస్యల గురించి పోరాడింది. అలాగే తనకి తెలవకుండా చాలా సమస్యలని కూడా కొని తెచ్చుకుంది. రోజు రోజుకి ఇలా తను ఎందుకు ట్వీట్స్ చేస్తుందో? అసలు వాటి గురించి కరెక్ట్ గా మాట్లాడే పరిష్కారం కోసం చూస్తుందో? అన్న ప్రశ్న అందరికి ఉంది.
అయితే నెటిజన్లు కూడా తన ట్వీట్స్ కి సంబంధం లేకుండా తనని దూషించడం జరిగింది. కొంతమంది తన ట్వీట్స్ కి రివర్స్ లో సమాధానం చెబితే వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసేవారంటా. ఇక ఈ విషయాలు అన్ని ఇప్పుడు ఎందుకు అంటే తన కొత్త ట్వీట్ లో తనకి వచ్చిన ఒక లెటర్ ని మరియు తన భర్తని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది.
చిన్మయి చేసిన ట్వీట్ “నేను ఎంతో ఆదరించే ఒక లేఖ ఇది. ధన్యవాదాలు. మీ పేరు భాగస్వామ్యం కావాలని మీరు కోరుకోనందున మీ గురించి నాకు బాగా తెలుసు.. నన్ను బాగా అర్ధం చేసుకున్న వారిలో మీరు ఒకరు కనుక మీ పేరు నేను ఇందులో చెప్పాలి అనుకుంటున్నా” అని తన భర్తని ఉద్దెశించి చెప్పింది.
ఇక వెంటనే తన భార్యని పొగడ్తలతో ముంచెత్తుతూ రాహుల్ కూడా తన ట్విట్టర్ లో “నేను ధైర్యంగల అమ్మాయిని వివాహం చేసుకున్నాను! బంగారు హృదయం ఉన్న అమ్మాయి తను. అలాగే ఒక రాక్‌స్టార్ కూడా… మీరు ఆమెను ప్రేమించండి లేదా ద్వేషించండి, ఏదో ఒక రోజు ఆమె హృదయం ఎల్లప్పుడూ సరైన స్థలంలో ఉందని మరియు ఆమె సరైన విషయాల కోసం పోరాడిందని మీరు గ్రహిస్తారు. మరియు ఏదో ఒక రోజు ఆమె వంటి అమ్మాయిల వల్ల అనుకున్న విషయాలు బాగుపడతాయి. అలా బాగుపడిన విషయాలు కూడా ఇప్పటికి చాలా ఉన్నాయి” అని అన్నారు.
I married a brave girl! A golden hearted girl. A rockstar
Love or hate her, someday you’ll realize her heart was always in the right place and that she fought for the right things. And someday soon, things will be better because of girls like her. Things already are. https://t.co/V7X6EzKkY0
— Rahul Ravindran (@23_rahulr) October 12, 2019
Credit:Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MF1qyn

Love or hate her, someday you’ll realize her heart was always in the right place and that she fought for the right things. And someday soon, things will be better because of girls like her. Things already are.
Comments
Post a Comment