ఈ రోజు ఒక వార్త సంచలనం సృష్టించింది. ఒకే పేరుతో ఇద్దరు ఉన్నందునా అభిమానులు ఒకరికి పంపబోయే మెసేజ్ ఇంకొకరికి పంపడం వలన ఇబ్బంది పడటం జరిగింది. ఇక అందులో ఒకరు స్పందించి….. నేను కాదు ఆ పేరుతో ఇంకొకరు ఉన్నారు. మీరు అందరూ అది గమనించాలి అనే సరికి ఆ సమస్య తీరిపోయింది. ఇంతకీ ఏమిటి ఆ సమస్య అంటే…
‘శ్రీనివాస్ రెడ్డి’ని ఎస్‌విబిసి (శ్రీ వెంకటేశ్వర భక్తి ) ఛానల్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ నెల 22 న ఆయన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మెసేజ్ చూసిన ఎవరైనా ఏమనుకుంటారు? మన తెలుగు హాస్య కథానాయకులు, మన అందరికి పరిచయం అయిన పేరు కాబట్టి టక్కున కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు అని అనుకుంటాము. కానీ అదే పేరుతో ఇంకొక ఇద్దరు దర్శకులు ఉన్నారు అని మన అందరికి తెలిసినా, తెలియకపోయినా అందులో పెద్ద సమస్యే ఉంది.
ఇక విషయం తెలిసిన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అభిమానులు శ్రీనివాస్ రెడ్డి కి ట్విట్టర్ లో, ఇంస్టాగ్రామ్ లో, పేస్ బుక్ లో మెసేజెస్ పంపగా…. కొంతమంది అయితే ఏకంగా కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పడం వలన తానే స్వయంగా రంగం లోకి దిగి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసాడు. “మీ అందరికి శుభోదయం. మీరు అనుకుంటున్నట్టు ఆ పోస్ట్ నాకు కాదు మన తెలుగు దర్శకులు అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన తీసిన సినిమా ‘డమరుకం’ మీరు అందరు పొరపడి నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు” అని అన్నారు.
అవును ఎస్‌విబిసి (శ్రీ వెంకటేశ్వర భక్తి ) ఛానల్ డైరెక్టర్‌గా నియమితులు అయినది దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారు. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, టాటా బిర్లా మధ్యలో లైలా, కుబేరులు, డమరుకం సినిమాలు తీసిన దర్శకులు. ఈ దర్శకుడి కొత్త సినిమా ‘రాగాల 24 గంటల్లో‘ సినిమా విడుదలకి సిద్ధం అవుతుంది.
ఇంకొక దర్శకుడి పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి అని ఉంది. అతను తీసిన సినిమా ‘శివమ్’ రామ్- రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన సినిమా. ఇలా ఒకే పేరుతో ముగ్గురు ఉన్నందునా జనాలు కంగారు పడటం లో తప్పు లేదు.
శుభోదయం
నేను కాదు
“ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారు”
ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించబడ్డారు https://t.co/h644kroNQs— Srinivasareddy (@Actorysr) October 13, 2019
Director Mr. Srinivas Reddy has been appointed as the channel director of SVBC. He is going to take the oath as director on 22nd of this month. pic.twitter.com/2m1cSrm25C
— BARaju (@baraju_SuperHit) October 13, 2019
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MPaMb1

Comments
Post a Comment