మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి ప్రాజెక్ట్ నుండి ఎట్టకేలకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అయ్యారు. సైరా విడుదలై తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధించడంతో చిరంజీవి ఖుషీగా ఉన్నారు. అదే ఉత్సాహంతో తన తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో షూటింగ్ కు వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెల్సిందే.
ఈ చిత్రం షూటింగ్ మొదలుకాక ముందే బయటకు లీకైన విషయం.. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని. అయితే చిరు, చరణ్ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, చిరంజీవి యవ్వన పాత్రను వేయనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రాణమని చెబుతున్నారు.
ఇదంతా బానే ఉంది కానీ చిరంజీవి యంగర్ వెర్షన్ గా రామ్ చరణ్ సరిపోతాడా అన్నదే సందేహంగా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ అచ్చుగుద్దినట్లు చిరంజీవిలా ఉండడు. ఇద్దరికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చిరంజీవే స్వయంగా తన పోలికలు చరణ్ కంటే ఎక్కువ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లలో ఉన్నాయని చెప్పడం మనకు గుర్తుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్.. చిరంజీవిలా మారడం అనేది ప్రేక్షకులు ఎంతవరకూ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VxqpYe
Comments
Post a Comment