నందమూరి బాలకృష్ణ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి ఒకటి. చరిత్రలో గుర్తించుకోదగ్గ రాజులలో ఒకరైన శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు ఈ చిత్రం గురించి ప్రస్తావన ఎందుకంటే..
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన గౌతమీపుత్ర శాతకర్ణి లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహారెడ్డి ఒక్క రోజులో అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సైరా మొదటి రోజు దాదాపు 53 కోట్లు సంపాదించగా, శాతకర్ణి మొత్తం తన ఫుల్ రన్ లో 49 కోట్లు వసూలు చేసింది.
అలాగే తెలుగు రాష్ట్రాల వరకూ శాతకర్ణి 34 కోట్లు ఫుల్ రన్ లో కలెక్ట్ చేయగా, సైరా మొదటిరోజునే 38 కోట్ల దాకా వసూలు చేయడం విశేషం. ఈ రకంగా బాలయ్య హిట్ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ ను ఒక్కరోజులో చిరు అధిగమించాడన్నమాట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OgDxiT
Comments
Post a Comment