మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి మొదటి రోజు సెలవు దినం కావడంతో కలెక్షన్స్ కుమ్మేసింది. అయితే నిన్న వర్కింగ్ డే వల్ల కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. అయినా కానీ సైరా స్లో అండ్ స్టడీగా ముందుకు దూసుకెళుతోంది. మొదటిరోజు (ప్రీమియర్స్ తో కలిపి) సైరా యూఎస్ లో 1.15 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
రెండో రోజు అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 9.45 నిమిషాలకు అందిన రిపోర్ట్ ప్రకారం 256 లొకేషన్స్ నుండి $102,213 వసూలు చేసింది. ఇవి డీసెంట్ నంబర్స్ అయినప్పటికీ చిత్రం లాభాల్లోకి రావాలంటే 3.5 మిలియన్ నుండి 4 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంది. రానున్నది వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమన్నా, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ వంటి ప్రముఖులు నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/353yXdT
Comments
Post a Comment