చూస్తుంటే హిందీ ప్రేక్షకులు బాగా కరువులో ఉన్నారా అన్నట్టు ఉంది పరిస్థితి. మన దగ్గర ఆడని సినిమాలు కూడా అక్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని మిగతా అన్ని చోట్లా తిప్పి కొడితే హిందీ ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. 150 కోట్లకు పైగా షేర్ వసూళ్లను అందించారు.
ఇది ఒక రకం అనుకుంటే తెలుగులో మహా మహా ప్లాపులైన చిత్రాలను డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో పెడితే వాటికి కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా ఎలాంటిదైనా దానికి కోట్లలో వ్యూస్ ఉంటున్నాయి. దువ్వాడ జగన్నాథం అక్కడ 17 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.
ప్రభాస్ నటించిన రెబెల్ అయితే 10 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ డిజాస్టర్ మూవీ అజ్ఞాతవాసి చిత్రాన్ని మనం దారుణంగా తిప్పికొట్టాం. అదే సినిమాను హిందీలో డబ్ చేసి ఎవడు 3 పేరిట రిలీజ్ చేస్తే ఇప్పటికే దానికి 10 కోట్ల పైన వ్యూస్ వచ్చాయి. ఇంకా రోజుకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ రకంగా మన ప్లాప్ సినిమాలను బాలీవుడ్ వాళ్ళు భలే మార్కెట్ చేసుకుంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2oppE76
Comments
Post a Comment