ఏ సినిమాకైనా లీకేజీ అనేది ఈరోజుల్లో సర్వసాధారణమైపోతోంది. అందులోనూ అది ఒక పెద్ద హీరో సినిమా అయితే దానికి ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సినిమా కథ ఇది అంటూ కొన్ని లీకేజీలు వస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మాత్రం ఈ లీకేజీల బెడద కొంచెం ఎక్కువగానే ఉంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. అంతేనా, రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అందులో ఉన్న దాని ప్రకారం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన ప్రజా సంక్షేమ పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్, మీటింగ్ స్టిల్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.
ఇలాంటి లీకుల వల్ల సినిమాలో ఉండే ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. వీటిపై సరిలేరు నీకెవ్వరు టీమ్ తగిన చర్యలు తీసుకోకపోతే ఇవి ఆగడం కష్టం. ఇది పక్కనపెడితే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నవంబర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేయాలని అనిల్ రావిపూడి అండ్ కో కష్టపడుతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ndpIXE
Comments
Post a Comment