మన తెలుగు వారి పెద్ద పండగ లో ఒకటి విజయదశమి. సినిమా వాళ్ళకి కూడా విజయం కలగాలి అని పండగ రోజు వారి సినిమాలలో ఎదో ఒక పోస్టర్ కానీ, పాట కానీ, సినిమా పేరు కానీ విడుదల చేసి పండగ రోజు అందరూ వాటి గురించి మాట్లాడుకునేలా చేసుకుంటారు. ఇక జనాలు కూడా కుటుంబాలతో కలిసి సినిమా విషయాలని పంచుకునే వారు కూడా ఉంటారు. కారణం పండగ కి అందరూ మంచిగా మాట్లాడుకునే వాటిలో సినిమా కూడా ఒకటి.
మరి అలాంటి రోజున విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజపుత్, రాశి ఖన్నా కలిసి నటిస్తున్న సినిమా “వెంకీ మామ“. సినిమాకి ‘పవర్’ సినిమా డైరెక్టర్ ‘కె.ఎస్.రవీంద్ర (బాబీ)’ గారు. సినిమాని అనుకున్న విధంగానే నిర్మించే నిర్మాత సురేష్ బాబు గారు ఈ సినిమాని కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యయం ఎక్కువైనా కూడా సినిమా అవ్వాలి అని చెప్పి దర్శకులు మీద భారం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే సినిమా కూడా అనుకున్న సమయం కంటే విడుదల లేట్ అయ్యింది.
సినిమా దీపావళికి విడుదల కానుండగా ఈ రోజు సినిమా లోని ఒక పోస్టర్ ని విడుదల చేశారు నిర్మాతలు. సినిమాలోని మొదటి వీడియో ట్రైలర్ రూపంలో రేపు పొద్దున్న 11:00 గంటలకి విడదల చేయబోతున్నారు అని ఉంది ఆ పోస్టర్ లో. ఇన్ని రోజులు సినిమా గురించి మాట్లాడుతున్న రూమర్స్ ని పుల్ స్టాప్ పెడుతూ ఇలా సినిమా వాళ్ళు పోస్టర్ రిలీజ్ చెయ్యడం మంచి పని అంటున్నారు వెంకటేష్ మరియు నాగ చైతన్య అభిమానులు.
అలాగే మిగిలిన సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా వారి సినిమాల గురించి రేపు వివరణ ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఈ విజవదశమి పండగ కూడా సినిమా ప్రియులకి గొప్ప పండగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tell it out loud, 11 am it is!! #VenkyMamaFirstGlimpse
HQ Posters: https://t.co/E7NCSbpGZE#VenkateshDaggubati | @chay_akkineni | @starlingpayal | @dirbobby | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy | @SBDaggubati | @vivekkuchibotla pic.twitter.com/TZYdaMlpYZ
— Venky Mama (@VenkyMama) October 7, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MnG7Bn
Comments
Post a Comment