
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. జీఏ2 పిక్చర్స్ , యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. అని అన్నారు.
నటీనటులు
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు
సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచర్ల
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
సౌండ్ – సింక్ సినిమా
స్టంట్స్ – జాషువా
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ – కృష్ణ కాంత్
మ్యూజిక్ – జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ – శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ – సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – సాయి కుమార్ రెడ్డి
నిర్మాత – ఎస్ కె ఎన్ (SKN)
ప్రొడక్షన్ హౌజ్ – జీఏ 2 పిక్చర్స్ మరియు యువి క్రియేషన్స్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంక్రిత్యాన్
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PKzqcM
Comments
Post a Comment