
దాంతో అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య రానున్నట్లు వార్తలు వచ్చాయి కానీ బాలయ్య రాలేదు కట్ చేస్తే అరవింద సమేత హిట్ అయిన నేపథ్యంలో విజయోత్సవ వేడుకకు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు . దాంతో నందమూరి అభిమానులకు పండగే పండగ . బాబాయ్ – అబ్బాయ్ లు కలిసి ఉన్న ఫోటో పదిలంగా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు . ఇక ఫోటో గ్రాఫర్ లకు కూడా మంచి గిరాకీ ఎందుకంటే ఆ ఫోటోలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి . నందమూరి కుటుంబంలో అరమరికలు లేకుండా అందరూ కలిసి ఉంటే అదే నిజమైన పండగ నందమూరి అభిమానులకు . ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అరవింద సమేత విజయోత్సవ వేడుక నందమూరి అభిమానుల సమక్షంలో జరగనుంది .
English Title: Good news for nandamuri fans
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2J9EULM
Comments
Post a Comment