పవన్ కళ్యాణ్ బాబాయ్ రిక్వెస్ట్ చేయడంతో రాంచరణ్ కూడా తిట్లి బాధితులను ఆదుకోవడానికి రంగంలోకి దిగాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో తిట్లి తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుళం జిల్లా మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయింది దాంతో టాలీవుడ్ హీరోలు పలువురు స్పందించి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే రాంచరణ్ మాత్రం ఇవ్వలేదు దాంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని రిక్వెస్ట్ చేశారు చరణ్ ని కూడా స్పందించి విరాళం ఇవ్వాలని. అదే సమయంలో జనసేన అధినేత గా శ్రీకాకుళం జిల్లాలోని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను వెళ్లి చూసాడు పవన్ కళ్యాణ్. ఆ సందర్భంగా చరణ్ ని ఏదైన గ్రామాన్ని దత్తత తీసుకోమని చెబుతానని అన్నాడు . ఇంకేముంది ఈ విషయం చరణ్ చెవిన పడటంతో బాబాయ్ చెప్పకా ఆలోచించేది ఏముంది తప్పకుండా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను కాకపోతే నా టీమ్ తో పాటుగా అక్కడి ప్రాంతానికి వెళ్లి ఏ గ్రామం అన్నది డిసైడ్ చేసుకుంటానని ఓ ప్రకటన జారీ చేశాడు రాంచరణ్.
గతకొంత కాలంగా మెగా కుటుంబం మళ్లీ ఒక్కటయ్యింది. అంతకుముందు ఉప్పు నిప్పులా ఉన్న కుటుంబం ఒక్కటి కావడంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. రంగస్థలం సూపర్ హిట్ కావడంతో చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చాడు పవన్ . ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నాడు. కైరా అద్వానీ చరణ్ సరసన నటిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రకటన జారీ చేసిన చరణ్ త్వరలోనే పర్యటన చేయనున్నాడట .
English Title: Ramcharan responds on pawan kalyan request

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PbC9PG
Comments
Post a Comment