
ఇక ఎన్టీఆర్ పై కూడా తన ప్రేమని వ్యక్తం చేస్తూ తను నటించిన అరవింద సమేత చిత్రం పై ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించాడు . బాలయ్య హరికృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల ప్రస్తావన తెచ్చిన ప్రతీసారి నందమూరి అభిమానులు చప్పట్లతో హాలంతా మారుమోగేలా చేసారు . ఈలలు , గోలలతో శిల్పకళా వేదిక దద్దరిల్లిపోయింది . ఇక ఎన్టీఆర్ కూడా నాన్న హరికృష్ణ ని తలుచుకుంటూ ఆ లోటు బాలయ్య బాబాయ్ తీర్చాడని ఆనంద బాష్పాలతో పులకించిపోయాడు . ఒకే ఫ్రేం లో బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కనిపించడంతో నందమూరి అభిమానులు కూడా పులకించిపోయారు .
English Title: Nandamuri balakrishna sensational comments on harikrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JdFEzG

Comments
Post a Comment