
ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ… ఇది కొత్త ఫీల్డ్. మేమంతా రాజకీయలంటూ తిరుగుతూ వచ్చాం. మనరేడియో ప్రవాస తెలుగువారి కోసం ప్రత్యేకంగా చేశారు. ఎక్కడో ఉన్న తెలుగువారికి మన జిల్లాలోని వార్తలు వినవచ్చు వార్తలు వినాలంటే ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ద్వారా వినేవాళ్ళం. ప్రస్తుతం అన్ని రేడియోల ద్వారా వార్తలు వినే అవకాశం వచ్చింది. మొమైల్ ద్వారా అన్ని వినవచ్చు. మొబైల్ మన దగ్గరుంటే రేడియో జేబులో ఉన్నట్టేనని పేర్కొన్నారు.
ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర మాట్లాడుతూ… వంశీ కడియాల నా క్లాస్‌మేట్. గత ఏడాది ప్రారంభిద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఇక ఆలస్యం చెయ్యకుండా నేను స్టార్ట్ చేస్తా అంటూ ముందుకు వచ్చాడు. దీని కోసం చాలా కష్టపడ్డారు. వేరే దేశాలలో ఉండేవారు ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో ఎక్కువ శాతం కారులో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా రేడియోనే వింటారు. ఎప్పుడూ ఇంగ్లీష్ స్టేషన్‌లు వినే వాళ్ళకి తెలుగు వింటుంటే మన ఇంటికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కాకుండా డివోషనల్ స్టేషన్ కూడా చాలా బావుంటుంది. అందరూ ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా కోరుతున్నాను అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ…మన తెలుగువాళ్ళు అమెరికాలో తెలుగువాళ్ళకు కావల్సిన వాళ్ళ ఆకలిని గుర్తించి ఒక స్టేషన్‌లో మాతభాషలో వస్తుంది. అనిల్ నాకు చెప్పినప్పుడు పెద్దగా నాకు దాని గురించి చెప్పలేదు. ఇది. ఎంతో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆర్ ఎక్స్ 100 హీరో కార్తీక్ మాట్లాడుతూ… రేడియో స్టేషన్ అంటే ఏదో చిన్నది అనుకున్నా. కానీ ఇంత పెద్దవాళ్ళు వస్తారని అనుకోలేదు. ఇక్కడకు వచ్చినందుకు గర్వంగా ఉంది. ఈ యాప్‌ను అందరూ ఉపయోగించుకోండని అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ… అనిల్‌గారు దాదాపుగా 18 బిజినెస్‌లు చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి ఇది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇది అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా వస్తుందని చెప్పారు. ఇంకా ప్రముఖ నిర్మాత దాము తదితరులు కూడా మాట్లాడారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NTFWw2
Comments
Post a Comment