Skip to main content

టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు

టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు
టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకున్న కెజిఎఫ్ దర్శకుడు

కెజిఎఫ్ తో అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ సినిమాను అందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సాధారణంగా చిన్న బడ్జెట్ లో, వేరే భాషల్లోకి కూడా పెద్దగా డబ్బింగ్ అవ్వని కన్నడ సినిమాను జాతీయ స్థాయిలో గర్వపడేలా నిలబెట్టాడు. అన్ని ఇండస్ట్రీల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. కెజిఎఫ్ విడుదలైన దగ్గరనుండి ప్రశాంత్ నీల్ తో పనిచేయాలన్న కోరికను చాలా మంది తెలుగు హీరోలు కనబర్చారు. ప్రస్తుతం ఈ కెజిఎఫ్ దర్శకుడు, రెండో పార్ట్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కెజిఎఫ్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఏంటా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే జోరుగా రూమర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. అయితే చాలా మంది హీరోల పేర్లు ఈ రూమర్స్ లో భాగంగా వినిపిస్తున్నా ఇంకా ఎవరూ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. ప్రశాంత్ నీల్ తన తర్వాతి సినిమాను తెలుగు హీరోతోనే చేయబోతున్నాడు.

కెజిఎఫ్ 2, మొదటి భాగం కన్నా మరింత భారీగా ఉండనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో విలన్ గా సంజయ్ డాట్ నటిస్తుండడంతో బాలీవుడ్ వాళ్ళ దృష్టి ఈ చిత్రంపై అధికంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే కెజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది. అందుకే కన్నడ హీరోలు కంటే తెలుగు హీరోలైతే ప్యాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవుతుందని ప్రశాంత్ నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్కడి టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ప్రశాంత్ టచ్ లో ఉంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ తో సినిమా అంటూ జోరుగా ప్రచారం జరిగింది కూడా. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అయితే అధికారికంగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని ప్రకటించింది. ఇద్దరి మధ్యా ఇప్పటికే కథాచర్చలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటో తెలియలేదు కానీ కొన్ని వారాల క్రితం ప్రశాంత్ హైదరాబాద్ వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకేముంది, బాబుతో ఈ కెజిఎఫ్ దర్శకుడి ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా అని జోరుగా మీడియా కథనాలు కూడా ప్రచురించింది. రెండు, మూడు సిట్టింగ్స్ అయినా కూడా కథ విషయంలో క్లారిటీ వచ్చినట్లు లేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి ప్రభాస్ తో టచ్ లోకి రావడం టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ ను కలిసి స్టోరీలైన్ చెప్పగా దానికి ఇంప్రెస్ అయిన ప్రభాస్ కచ్చితంగా సినిమా చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అయితే బాలీవుడ్ లో మార్కెట్ బాగుంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ అని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తుండగా ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ప్రభాస్ కు కథలు వినిపించారు. మరి ప్రభాస్ ఎవరికి ఓకే చెబుతాడో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KxsgIf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...