
ఎన్.ఎన్.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వరరావు మాట్లాడుతూ – “హీరో అజిత్ సినిమాలకు తమిళనాడులోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలంటే అక్కడ పండుగ వాతావరణమే. అజిత్, శివ కాంబినేషన్‌లో మూడు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీరి కలయికలో వచ్చిన నాలుగో బ్లాక్ బస్టర్ విశ్వాసం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఎందరో నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడ్డారు. ఫ్యాన్సీ ఆఫర్‌తో తెలుగు హక్కులను దక్కించుకున్నాను. అవకాశం ఇచ్చిన సత్యజ్యోతి ఫిలింస్ వారికి నా ధన్యవాదాలు. సత్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేషన్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుదల చేయబోతున్నాం. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేషనల్ సక్సెస్ అవుతుంది“ అన్నారు.
అజిత్, నయనతార, జగపతిబాబు, అనైక, వివేక్, రోబో శంకర్, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: రూబెన్, సంగీతం: డి.ఇమాన్, సినిమాటోగ్రఫీ: వెట్రి, నిర్మాత: ఆర్.నాగేశ్వరరావు, రచన, దర్శకత్వం: శివ
English Title: Ajith’s Viswasam to release on 1st March
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T2v1af

Comments
Post a Comment