
నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ – “తమిళంలో సూపర్‌డూపర్‌హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌లో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాను లావిష్‌గా తెరకెక్కించబోతున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన తన లుక్‌ని మార్చుకున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను రమేష్‌వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను తెలియజేస్తాం“ అన్నారు.
English Title: Bellamkonda Sai Srinivas new movie launched
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EnIcuh

Comments
Post a Comment