Skip to main content

అల్లు శిరీష్ “ఏబిసిడీ” ఫస్ట్ సింగిల్ గ్రాండ్ లాంచ్

Allu Sirish, Niharika Konidela Launch ‘Mella Mellaga’ Single From ‘ABCD’కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు.  మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు,  బాల నటుడు భరత్  ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను హైలైఫ్ పబ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న మోస్ట్ వాంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట పాడటం విశేషం. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో లైవ్ లో సిద్ శ్రీరామ్ పాట పాడి సందడి చేశాడు. మెల్ల మెల్లగా ఆంటూ సాగే ఈ పాటను కెకె రచించగా సిద్ శ్రీరామ్ అదితితో కలిసి ఆలపించారు. ఈ సాంగ్‌కు సంబంధించిన బిగ్ సీడీని నిహారికా కొణిదెల విడుద‌ల చేశారు.  ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ఈ సందర్బంగా

 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుధా శాండీ మాట్లాడుతూ – “తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకుని చాలా రోజులుగా అనుకునేవాడిని నా క‌ల నేటితో నిజమైంది. మై ఫ్రెండ్ హీరో అల్లు శిరీష్ తో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చాలా థాంక్స్. మెల్ల మెల్లగా అనే ఈ పాటను సిద్ చాలా అద్భుతంగా పాడారు. కృష్ణ‌కాంత్‌గారు ఎక్స్‌లెంట్‌గా రాశారు. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

 

నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ మాట్లాడుతూ – “జుడా శాండీగారికి తెలుగు సినిమాల్లోకి మా సినిమా ద్వారా ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆయ‌న చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు చాలా మంచి పేరు వస్తుంది. అలాగే పాట‌ను చ‌క్క‌గా పాడిన సిద్ శ్రీరాంకు అభినంద‌న‌లు. సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్‌లో నిల‌బ‌డుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. మంచి ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాం“ అన్నారు.

 

ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – “నా పై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడిగా నాకు అవ‌కాశం ఇచ్చిన అల్లు శిరీష్‌గారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. య‌ష్ రంగినేనిగారు ఈరోజు ఇక్క‌డ‌కు రాలేక‌పోయారు. ఆయ‌న‌కు, ధీర‌జ్ మొగిలినేని గారికి థాంక్స్‌. జుడా శాండీ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. భ‌విష్య‌త్‌లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటారు. కృష్ణ‌కాంత్‌గారు అద్భుత‌మైన సాహిత్యం అందించారు. సిద్‌గారి వాయిస్‌తో ఈ పాట‌కు ఇంకా అందం వ‌చ్చింది. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

 

కెమెరామెన్ రామ్‌ మాట్లాడుతూ – “ఈ ప్రాజెక్ట్‌కి ప‌నిచేయడం హ్య‌పీ. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.

 

భ‌ర‌త్ మాట్లాడుతూ – “శాండీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిద్ శ్రీరాంగారు పాడిన తొలి పాట‌ను అద్భుతంగా పాడారు. మంచి ఆల్బ‌మ్‌ను అందించినందుకు థాంక్స్‌“ అన్నారు.

 

నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ – “ఈ సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్… సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

 

రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ – “మంచి టీంతో ఈ సినిమా చేయ‌డం హ్య‌పీగా ఉంది. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఈ రోజు విడుద‌లైన సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే సినిమా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.

 

నిహారిక కొణిదెల మాట్లాడుతూ – “సాంగ్ చాలా బాగా న‌చ్చింది. నేను సిద్ శ్రీరాంకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మ‌ధుర శ్రీధ‌ర్ స‌హా ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు. శాండీకి తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. సినిమా చాలా బాగా ఆడుతుంది“ అన్నారు.

 

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ… ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి. అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా. ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసిన సింగిల్ గురించి మాట్లాడుతూ. నేను ఓ రోజు బెంగళూరులో కారులో వెళ్తున్నప్పుడు రేడియోలో ఓ పాట విన్నాను. ఆపాట ఇంగ్లిష్ లో స్టార్ట్ అయి కన్నడలో వచ్చింది. సాంగ్ చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ గురించి తెలుసుకున్నప్పుడు జుదా సాంధీ గురించి తెలిసింది. ఈ తరహా సౌండ్ తెలుగు సినిమాకు తీసుకురావాలనిపించింది. ఎబిసిడి సినిమాకు జుదా కరెక్ట్ అనిపించింది. అతనితో ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ పాటకు ఓకల్స్ అందించిన సిద్ శ్రీరామ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన పాటలంటే అంత ఇష్టం. నా సినిమాలోని మంచి పాటను సిద్ పాడటం చాలా హ్యాపీగా ఉంది.  నా నిర్మాతలు మధుర శ్రీధర్, యశ్ రంగినేని, కో ప్రొడ్యూసర్ ధీరజ్, మా డైరెక్టర్ సంజీవ్ గురించి మా టెక్నీషియన్స్ గురించి వచ్చే ఫంక్షన్ లో మాట్లాడుతాను. అని అన్నారు.

 

English Title: Allu Sirish, Niharika Konidela Launch ‘Mella Mellaga’ Single From ‘ABCD’

Priyadarshi ready to risk his career30 Years Prithvi setires on NTR biopicSamantha and Naga Chaitanya's Majili teaser talkNeena gupta revealed her problemsRajinikanth to not contest in Lok Sabha elections



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XfCUZ1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...