
ఈ సందర్భంగా…
డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ… సిరివెన్నెల మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ రెండు పాటలున్నాయి. కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల అనే గొప్ప సినిమా తీశారు. మా సినిమా జోనర్ వేరు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ సిరివెన్నెల. కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి గారు మా సినిమా చేస్తున్నారు. ఆమె కొత్త లుక్ లో కనిపిస్తారు. థ్రిల్లర్ హార్రర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుంది. కాలకేయ ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. మహా నటి ఫేమ్ సాయి తేజ మంచి పాత్ర చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మా షూటింగ్ ఇంత బాగా జరిగిందంటే మా నిర్మాతలు కమల్, బాషా, రాం సీతా గారి వల్లే. అని అన్నారు
ప్రియమణి మాట్లాడుతూ…
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న వయసులో సాయి తేజ మంచి పాత్ర చేస్తుంది. మా డైరెక్టర్ చాలా కూల్. ప్రభాకర్ చాలా మంచి క్యారెక్టర్ చేశారు. మా నిర్మాతలకు చాలా థాంక్స్. సూపర్ నేచురల్ సంబంధ విషయాలు నేర్చుకునే ప్రాసెస్ లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ థ్రిల్లింగ్ గా చెప్పారు. అని అన్నారు.
కాలకేయ ప్రభాకర్ మాట్లాడుతూ… కన్నింగ్ బిసినెస్ మ్యాన్ క్యారెక్టర్ చేశా. చాలా మంచి పాత్ర. కామెడీ కూడా చేశాను. డబ్బింగ్ చెప్పాను సినిమా బాగా వచ్చింది. ప్రియమణి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. అని అన్నారు.
నిర్మాత భాషా మాట్లాడుతూ…. కీరవాణి గారి దగ్గర నేను బాహుబలి 2 వరకు మేనేజర్ గా పని చేసాను. మా నిర్మాత కమల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మా తొలి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. అని అన్నారు.
English Title: Priyamani as Sirivennela
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DY7pdb

Comments
Post a Comment