Skip to main content

సరిలేరు నీకెవ్వరు – ఆ ఒక్క ఎపిసోడ్ పైసా వసూల్

సరిలేరు నీకెవ్వరు - ఆ ఒక్క ఎపిసోడ్ పైసా వసూల్
సరిలేరు నీకెవ్వరు – ఆ ఒక్క ఎపిసోడ్ పైసా వసూల్

అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్. ప్రేక్షకులను ఈజీగా ఆకట్టుకునేది ఎంటర్టైన్మెంటే. రిపీట్ వేల్యూ ప్రకారం చూసుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ కు అగ్ర తాంబూలం ఇవ్వాల్సిందే. ఇదే ఎంటర్టైన్మెంట్ ను నమ్ముకున్న ఎందరో దర్శకులు లైమ్ లైట్లో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు తీసే దర్శకులలో అనిల్ రావిపూడి ముందుంటాడు. ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేసిన అనిల్ రావిపూడి అన్నిట్లోనూ కామెడీ హైలైట్ అయ్యేలా చూసుకున్నాడు.

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2… ఇలా అనిల్ రావిపూడి సినిమాలు అన్నిట్లోనూ కామెడీ సూపర్బ్ గా వర్కౌట్ అయింది. ఇందులో ఉండే రిపీట్ వేల్యూనే ఈ సినిమాలు హిట్ అయ్యేలా చేసింది. ఇప్పటివరకూ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్ వంటి టాప్ స్టార్ తో చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంలో కూడా తన ప్రధాన బలాన్ని వదులుకోవట్లేదు అనిల్. ఇందులో కూడా కామెడీనే హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 30 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు అనిల్. వెంకీ సినిమాలో ఉండే ట్రైన్ ఎపిసోడ్ తరహాలో ఇందులో కూడా ఫన్ ఓ రేంజ్ లో ఉండేలా సీన్ రాసుకున్నాడట.

ఈ ఒక్క సీన్ కే నవ్వి నవ్వి పొట్టలు చెక్కలవుతాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ ప్రచారం చేస్తోంది. ట్రైన్ ఎపిసోడ్ తోనే పైసా వసూల్ అన్న భావన కలుగుతుందని, మిగిలినదంతా బోనస్ లానే అనిపిస్తుందని అంటున్నారు. వెంకీ తర్వాత ఆ రేంజ్ ట్రైన్ కామెడీ రాలేదు. దూకుడు తర్వాత మహేష్ కూడా ఒక రేంజ్ దాటి కామెడీ చేసింది లేదు. ఈ మధ్యనంతా సటిల్ యాక్టింగ్ తోనే మహేష్ లాక్కొస్తున్నాడు. ఇది మహేష్ అభిమానులకు కూడా నచ్చట్లేదు. తమ హీరో అతి మంచివాడిగా ఎప్పుడూ నటించాల్సిన అవసరం లేదని వారు అనుకుంటున్నారు. అందుకనే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై వారు భారీ ఆశలే పెట్టుకున్నారు.

మహేష్ కెరీర్ లో ఇది మరో దూకుడు అవ్వగలదని వారు బలంగా నమ్ముతున్నారు. కేవలం కామెడీపైనే కాకుండా అనిల్ రావిపూడి ఈ చిత్రంలో యాక్షన్ పై కూడా ఫోకస్ పెట్టాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్, రాయలసీమ ఫ్యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా వర్కౌట్ అవుతాయని అంటున్నారు. మరి నిజంగానే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఇవన్నీ ఉంటే ఇక ఈ సినిమాను ఆపడం ఎవరి తరమూ కాదు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32GnKyq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...