Skip to main content

న‌య‌న‌తార ఫ్యామిలీ హార‌ర్ చిత్రం `ఐరా` ఈ నెల‌28న విడుద‌ల‌!

Nayanatara AIRAA movie get release dateన‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` ఈ నెల 28న విడుద‌ల కానుంది. గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది.  స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా గురించి

 

గంగా ఎంటర్టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేతలు మాట్లాడుతూ “న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` సినిమా పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ప్ర‌జల్లోకి వెళ్లాయి. డీ గ్లామ‌రస్ భవానీగా న‌య‌న‌తార లుక్స్ కి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. పోస్ట‌ర్‌లో భ‌వాని, య‌మున అనే రెండు పాత్ర‌ల రూపురేఖ‌ల మ‌ధ్య ఉన్న వేరియేష‌న్ క‌థ‌లోనూ క‌నిపిస్తుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్లు ఇష్ట‌ప‌డేవారికి మాత్ర‌మే కాదు, భావోద్వేగాల‌ను ఇష్ట‌ప‌డే వారంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మా `ఐరా` భారీగా విడుద‌లై వేస‌విలో అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌డం ఖాయం“ అని అన్నారు.

ర్శకుడు ర్జున్ మాట్లాడుతూ “ఇంద్రుడి వాహనం పేరు ఐరావ‌తం. అందులోనుంచే మేం `ఐరా` అనే ప‌దాన్ని ఎంపిక చేసుకున్నాం. `ఐరా` అన‌గానే అంద‌రూ న‌య‌న‌తార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాక‌పోతే పాత్ర బ‌లాన్ని సూచించ‌డానికి  `ఐరా` అని పేరు పెట్టాం. స్క్రిప్ట్  ప‌నులు జ‌రిగే స‌మ‌యంలో న‌య‌న‌తార మేడ‌మ్ రెండు పాత్ర‌లు చేస్తార‌ని అనుకోలేదు. కానీ ఎందుకో ఒక‌సారి ఆ ఆలోచ‌న త‌ట్టింది. వెంట‌నే ఆమెను సంప్ర‌తించి విష‌యాన్ని వివ‌రించాం. `లుక్ టెస్ట్ చేసిన త‌ర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను` అని ఆమె అన్నారు. ఆ మాట ప్ర‌కారం లుక్ టెస్ట్ చేశాం. ఇక మేం భ‌వాని పాత్ర కోసం ఇంకెవ‌రినీ సంప్ర‌తించాల్సిన అవ‌స‌రం లేద‌ని అర్థ‌మైంది. మా భ‌వాని, య‌మున పాత్ర‌లను ఒక్క‌రే చేయ‌బోతున్నార‌ని అంద‌రం సంతోషించాం. ఇది సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ, రెగ్యుల‌ర్ హార‌ర్ జోనర్ల‌లో క‌నిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాల‌ని ప్ర‌య‌త్నించాం. సినిమా చూసి ఇంటికెళ్లే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఇందులోని అంశాల‌ను ప‌దిలంగా మోసుకెళ్తారు. సాంకేతికంగానూ ఎక్క‌డా రాజీప‌డ‌కుండా తెర‌కెక్కించాం.  సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. హార‌ర్ చిత్రాల్లో సౌండ్ కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే చాలా సంద‌ర్భాల్లో సైలెన్స్ కూడా చాలా ఎక్కువ విష‌యాల‌ను చెప్ప‌గ‌లుగుతుంది. అందుకే వాటి రెండింటిని క‌లిపి ఇందులో మేం చేసిన ప్ర‌య‌త్నానికి త‌ప్ప‌కుండా మెప్పు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాం. తొలి స‌గం ఎంత ఉత్కంఠ‌గా సాగుతుందో, రెండు స‌గం అంత‌కు మించి ఉంటుంది. ప‌ర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిద‌ర్శ‌నం ఈ సినిమా“ అని అన్నారు.

టీనటులు

కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,

కూర్పు:  కార్తిక్ జోగేష్‌,

స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌

సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌.

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Fd69Ul

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...