Skip to main content

`ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం` టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన నిర్మాత రాజ్‌కందుకూరి

akashvani vishaka pattana kendram movie title poster launchశివ‌, ఉమ‌య హీరో హీరోయిన్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`. జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “సతీష్ బ‌త్తుల తొలిసారి డైరెక్ట‌ర్‌గా మారుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`. ముందు ఈ క‌థ‌ను స‌తీష్ నాకు వినిపించాడు. చాలా బావుంద‌ని అప్రిషియేట్ చేశాను. ఇప్పుడు సినిమాను సిద్ధం చేసి టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌మ‌ని క‌లిశాడు. చాలా మంచి క‌థ‌. త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. నిర్మాత మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్‌గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రం. ఆయ‌న‌కు నిర్మాత‌గా మంచి పేరు, డ‌బ్బును తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.

చిత్ర నిర్మాత మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్ మాట్లాడుతూ – “సతీష్‌గారు క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించాను. హీరో శివ‌, హీరోయిన్ ఉమ‌య చ‌క్క‌గా న‌టించారు. మంచి టీం కుదిరింది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌తీష్ బ‌త్తుల మాట్లాడుతూ – “జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా నేను అంద‌రికీ సుప‌రిచితుడినే. అయితే నేను డైరెక్టర్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీ వ‌చ్చాను. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌డం ఆనందంగా ఉంది. మీ అశీర్వాదం ఎప్పటికీ ఉంటుంద‌ని భావిస్తున్నాను. అలాగే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న `ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం` చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లిఖార్జున్ స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాము. మేకింగ్‌లో మ‌ల్లిఖార్జున్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. శివ‌, ఉమ‌య‌, దేవిప్ర‌సాద్‌, మాధ‌వీల‌త ఇలా మంచి ఆర్టిస్టులు కార్తీక్  మ్యూజిక్‌, ఆరీఫ్ సినిమాటోగ్ర‌ఫీ .. ఇలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి మాకు ప్రోత్సాహాన్ని అందించిన రాజ్‌కందుకూరిగారికి థాంక్స్‌“ అన్నారు.

 

శివ‌, ఉమ‌య‌, దేవిప్ర‌సాద్‌, మాధ‌వీల‌త‌, స‌త్య‌, ధ‌న‌రాజ్‌, సూర్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌:  ప్ర‌దీప్‌, డ్యాన్స్‌:  శ్రీకృష్ణ‌, ఎడిట‌ర్‌:  ప్ర‌భు, మ్యూజిక్‌:  కార్తీక్, సినిమాటోగ్ర‌ఫీ: ఆరీఫ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ బ‌త్తుల.

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HFk1ta

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...