
సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ”ఈ చిత్ర నిర్మాత గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో సినిమా చేయాలని అంటుండే వాడు. నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం యోగేశ్వర్ క్యారెక్టర్‌కు అనుగుణంగా కథ, కథనం ఉంటుంది. దర్శకుడు శివాజీ ఎంతో శ్రమపడి చిత్రాన్ని అద్యంతం రమణీయంగా తీర్చిదిద్దారు. ఇతర పాత్రధారులు అతిథి, షియాజీ షిండే, శ్రవణ్, రఘు, జీవా, శివాని, మకరందేష్ పాండే వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నేనూ ఒక ముఖ్యపాత్ర పోషించాను. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ మంచి బాణీలు ఇచ్చారు” అని అన్నారు.
చిత్ర నిర్మాత జి.వి.వి.గిరి మాట్లాడుతూ ”చిత్ర నిర్మాణంలో వెన్నంటి వుండి పూర్తి సహకారాన్ని అందించిన మా హీరో సుమన్ గారిని ఎప్పటికీ మరువలేము. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్ పాత్రను అర్థం చేసుకుని నటించాడు. పరారి చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటుగా విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. కొత్త హీరోకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని” అని అన్నారు.
హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ ”సుమన్ అంకుల్ కథ విషయంలోగానీ, చిత్రీకరణ సమయంలో కానీ సొంత సినిమాలా భావించి సహకరించారు. నటించేపుడు సహ నటుల నుండి ఎంతో నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారు” అని చెప్పారు.
దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ ”పరారి చిత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. రన్ ఫర్ ఫన్ అనేది ఉప శీర్షిక. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించాం” అని చెప్పారు.
ఇంకా ఈ వేడుకలో శ్రవణ్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, గౌతమ్ రాజు కూడా మాట్లాడారు.
ఈ చిత్రంలో యోగేశ్వర్, అతిథి, సుమన్, భూపాల్, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రవణ్, జీవా, శివాని, మకరందేష్ పాండే, జబర్దస్త్ శీను, కల్పలత, మాధవి, నీలిమా తదీతరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, ఛాయాగ్రహణం: అంజి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్టంట్స్: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: గాలి వి.వి.గిరి, రచన, దర్శకత్వం సాయి శివాజీ.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HEMMGr







Comments
Post a Comment