Skip to main content

ఓన్లీ నేను … బ‌ట్ నాట్ ఎలోన్ చిత్రం ట్రైల‌ర్ లాంచ్‌

Only Nenu - But not alone Trailer Launchస‌ర్క‌డ‌మ్‌స్టోరీస్ బ్యాన‌ర్ పై స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఓన్లీ నేను. పూర్విట‌క్క‌ర్‌, చింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శేష‌గిరిరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర  ట్రైల‌ర్‌ను ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో మీడియా స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

 

ద‌ర్శ‌కుడు స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ… ప్రేమ‌, ఫ్యామిలీ, కామెడీ ఇవ‌న్నీ కామ‌న్ గా వ‌చ్చే స్టోరీలు. బేసిక్‌గా నేను ఒక వ్యాప‌ర‌వేత్త‌ని. కొంత‌మంది పెద్ద‌వాళ్ళ స‌ల‌హా మేర నేను స‌ర్క‌డ‌మ్ స్టోరీస్ అనే బ్యాన‌ర్‌ పెట్ట‌డం జ‌రిగింది.   ఈ చిత్ర క‌థాంశం ప్ర‌పంచం మొత్తంలో టాప్‌టెన్ బిలినియ‌ర్స్‌లో మ‌హిళలు లేక‌పోవ‌డం అనే అంశం పై క‌థ. ఒక అంద‌మైన తెలివైన అమ్మాయికి క‌లిగిన బాధ‌ ఎక్క‌డుంది ఉమెన్ ఎన్‌ప‌వ‌ర్‌మెంట్ అంటూ… నేనెందుకు ఆ స్థానంలో ఉండ‌కూడ‌దు అన్న‌దే ఆ అమ్మాయి గోల్‌. అందులో భాగంగానే త‌న సొంత స్నేహితురాలిని సైతం చంప‌డానికి వెన‌కాడ‌దు. ఈ సర్క‌డ‌మ్ స్టోరీస్ బ్యాన‌ర్ త‌ర‌పున అఫీషియ‌ల్‌గా ఈ రోజును విడుద‌ల చేశాము. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

నిర్మాత శేష‌గిరిరావు మాట్లాడుతూ… నాకు ఈ చిత్రం ద్వారా ఆయ‌న‌తో భాగ‌స్వామ్యం కావ‌డం చాలా సంతోషంగా ఉంది. డిసెంబ‌ర్‌6కి ఈ చిత్రం పూర్త‌వుతుంది. ఈ చిత్రంలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అన్నారు.

 

హీరో చింగ్ మాట్లాడుతూ… నేను ఒక లాయ‌ర్‌ని న‌న్ను న‌మ్మి నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

 

హీరోయిన్ పూర్వి ట‌క్క‌ర్ మాట్లాడుతూ… నేను శ్రీ‌నివాస్‌గారితో క‌లిసి గ‌తంలో చాలా ప్రాజెక్ట్‌లో ప‌ని చేశాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా విడుద‌ల కోసం నేను కూడా చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా అన్నారు.

 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాల‌చంద‌ర్ మాట్లాడుతూ… మీరు ట్రైల‌ర్‌లో చూసిన పాట నేనే చేశాను. నాకు తెలిసి మీ అంద‌రికీ బాగా న‌చ్చి ఉండ‌చ్చు. గ‌తంలో నేను జెనీలియా క‌థ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. త‌ర్వాత నాకు త‌మిళ్‌లో ఆఫ‌ర్స్ వ‌స్తే వెళ్ళాను. ఇప్పుడు మ‌ళ్ళీ తిరిగి తెలుగు ఇండ‌స్ర్టీకి ఈ సినిమాతో క‌మ్‌బ్యాక్ అనుకుంటున్నాను. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.

 

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నావాస్‌, శేష‌గిరిరావు, చింగ్‌, పూర్విట‌క్క‌ర్‌, మైరా అమిటి, బాలచంద‌ర్‌, సంధ్యారెడ్డి, చ‌త‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HI2oZO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...