Skip to main content

ఏప్రిల్ మూడో వారంలో దిక్సూచి చిత్రం.. ‘దిక్సూచి మ్యూజిక్’ యాప్ ద్వారా పాటలు విడుదల..!!

diksuchi in the third week of April Release of songs by diksuchi Music Appదిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా అయన స్వీయ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం “దిక్సూచి”.. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పిస్తుండగా  శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి  నిర్మిస్తున్నారు.‌ ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ సినిమా పై మంచి ఆసక్తిని కలిగించింది.. ఏప్రిల్ మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..  కాగా ఈ చిత్ర ఆడియో ని ‘దిక్సూచి మ్యూజిక్’ అనే యాప్ ద్వారా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. హైదరాబాద్ లో ఘనంగా జరగగా ఈ  కార్యక్రమానికి చిత్రబృందం హాజరైంది..

 

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో దిలీప్‌కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ..దిక్సూచి చిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌ గా తెరకెక్కుతుంది.. థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో పాటు అన్నిరకాల ఎమోషన్స్ ఈ సినిమా లో ఉన్నాయి.. రెండు గంటలు మిమ్మల్ని తప్పకుండా ఆనందింపచేస్తుంది..ఉగాది రోజు ఇదే బ్యానర్ లో ఇంకో సినిమా చేస్తున్నాం.. మళ్ళీ నాకు అవకాశమిచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్ర ఆడియో ని రిలీజ్ చేశాక ఎవరికీ సాంగ్స్ ని ఇవ్వలేదు.. మేమె ఓన్ గా రిలీజ్ చేయాలనీ ‘దిక్సూచి మ్యూజిక్’ అనే యాప్ ని క్రియేట్ చేసి ఈ యాప్ ద్వారా ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చేస్తున్నాం.. ఈ యాప్ ద్వారా ఫ్యూచర్ లో మరిన్ని సినిమా సాంగ్స్ ని రిలీజ్ చేయబోతున్నాం..ఎక్కడికి వెళ్లిన సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.. ఇటీవలే ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ కి మా టీం వెళ్లగా అక్కడ కూడా ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది..అక్కడి ప్రేక్షకులు ట్రైలర్ బాగుంది అంటూ మంచి ప్రోత్సాహమిచ్చారు.. అక్కడివారు కూడా తెలుగులో సినిమా లు నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి సిద్ధం చేస్తున్నాం..  దాని పేరు రైన్ బో కార్పెట్ షో గా నిర్ణయించాం..ఈ ఈవెంట్ కి కామన్ ఆడియెన్స్ వచ్చి ఈ సినిమా ను చూసి వారే ఈ సినిమా ఎలా ఉంది అని టీవీ ఇంటర్వ్యూ ల్లో చెప్తారు. ఇంతవరకు ఇలాంటి ప్రమోషన్ ఎవరు చేయలేదు..ఏప్రిల్ మూడో వారంలో సినిమా రిలీజ్ చేస్తున్నాం..  అన్నారు..

 

నిర్మాత నరసింహ రాజు రాచూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ ఉన్న చిత్రం.. ఇందులో ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు లేవు, కథ నచ్చి చేసిన సినిమా ఇది.. అందుకే ఈ సినిమా ని నిర్మించాను.. ఈ సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది.. ఒక మంచి సినిమా ప్రేక్షకుల మధ్యకు వెళ్లాలనేదే నా తాపత్రయం.. ఈ సినిమా ని ఆదరించి హిట్ చేయాలి అని కోరుతున్నాను అన్నారు..

 

నటుడు  అరుణ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చి చాల బాగా ఎంకరేజ్ చేశారు.. ఒక సామాన్యుడిగా దిలీప్ ఈ సినిమా చేశాడు, రేపు అయన అసామాన్యుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను.. అలాగే ప్రొడ్యూసర్ గారికి సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను.. ఈ సినిమా లో కొత్త నటీనటులు చాల మంది నటించారు.. ఈ సినిమా విజయం మా అందరికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నాను..సినిమా కథ లో బలం ఉంది.. మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి.. అందరు ఈ సినిమా ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను..

 

దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక ,  బిత్తిరి సత్తి , రాకేష్ , మల్లాది భాస్కర్ , సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంఃదిలీప్ కుమార్ స‌ల్వాది, ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాఃజ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మనాభ్  భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్‌, డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FhfI4B

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...