Skip to main content

`జెస్సీ` చిత్రాన్ని స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – స‌క్సెస్ మీట్‌లో నిర్మాత శ్వేతా సింగ్‌

jessie movie success meetఅతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుద‌లైంది. ఈ సందర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో…

పివిఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ – “టీజ‌ర్ చూశాను చాలా బాగా న‌చ్చింది. వెంట‌నే శ్వేతగారికి మేడ‌మ్ హార‌ర్‌లో ది బెస్ట్ మూవీ వ‌స్తుంది అని చెప్పాను. మేడ‌మ్ రిలీజ్ టైంలో చిన్న మూవీ క‌దా! చూసి రిలీజ్ చేయండి అన్నారు. కానీ ఇది నాకు చాలా పెద్ద మూవీగా క‌న‌ప‌డుతుంది మేడ‌మ్ అని చెప్పి విడుద‌ల చేశాం. ఈ సినిమాకు ఇంత పెద్ద రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. వ‌న్ షోతో స్టార్ట్ అయిన మల్టీప్లెక్స్‌లో 7 షోస్ ర‌న్ అవుతుంటే… వ‌న్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోస్‌తో ర‌న్ అవుతున్నాయి. మొద‌టి మూడు రోజుల్లో ప్ర‌తి రోజూ క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌చ్చాయి. శుక్ర‌వారం వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కంటే ఈరోజు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి“ అన్నారు.

నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ – “చాలా క‌న్‌ఫ్యూజ‌న్స్ మ‌ధ్య సినిమాను విడుద‌ల చేశాం. అయితే ఆడియెన్స్ టాక్ విన్న త‌ర్వాత మేం ప‌డ్డ క‌ష్ట‌మంతా మ‌ర‌చిపోయాం. పివిఆర్ సినిమాస్ వారు మాపై న‌మ్మ‌కంతో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని వారు న‌మ్మారు. వారి న‌మ్మ‌కం ఈరోజు నిమైంది. ప్రేక్ష‌కులు మా సినిమాను ఇలాగే ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు అశ్వినికుమార్‌.వి మాట్లాడుతూ – “సినిమా రిలీజ్‌కు చాలా స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేశాం. చివ‌ర‌కు పివిఆర్ సినిమా ఉద‌య్‌గారిని క‌లిశాం. చిన్న‌గా విడుద‌లైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. మంచి కాన్సెప్ట్ ఉంటే ఆద‌రిస్తామ‌ని ప్రేక్ష‌కులు నిరూపించారు. ప్రేక్ష‌కులు ఇంకా మా సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.

ఆషిమా న‌ర్వాల్ మాట్లాడుతూ – “ఇంత పెద్ద రెస్పాన్స్ రావ‌డానికి ప్రేక్ష‌కులు అందించిన ప్రోత్సాహమే. మీడియా ప్ర‌తినిధులు కూడా త‌మ వంతుగా స‌పోర్ట్ చేశారు. జెన్యూన్ సినిమాలో భాగ‌మైన ఎంట‌టైర్ యూనిట్‌కు థాంక్స్‌. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన ద‌ర్శ‌కుడు అశ్విని కుమార్, నిర్మాత శ్వేతా గారికి థాంక్స్‌. టీం ఎఫ‌ర్ట్ స‌క్సెస్ ఇవ్వ‌డం ఇంకా ఆనందాన్నిచ్చింది“ అన్నారు.

 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ – “లాంగ్ జ‌ర్నీ. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. నిర్మాత శ్వేత‌, డైరెక్ట‌ర్ అశ్విన్ సినిమాను న‌మ్మి నిల‌బ‌డ్డారు. ఈ సినిమాను ఐదేళ్ల క్రితం నాకు డైరెక్ట‌ర్ చెప్పారు. ఈ సినిమా త‌ర్వాత నేను 12 సినిమాల‌కు ప‌నిచేశాను. అస‌లు సినిమా ఏమ‌వుతుందోన‌ని భ‌య‌పడ్డాను. కానీ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం ఆనందంగా ఉంది“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

 

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HD0Gsu

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...