Skip to main content

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌ల‌

HIPPI movie Teaser Release Eventనేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా `హిప్పీ` టీజ‌ర్ విడుద‌లైంది. `RX 100` ఫేమ్ కార్తికేయ  హీరోగా న‌టించిన చిత్ర‌మిది.  స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా,   టీఎన్ కృష్ణ  దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై  రూపొందుతోంది. ఈ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ “కార్తికేయ‌తో క‌లిసి `గ్యాంగ్ లీడ‌ర్‌`లో  ప‌నిచేస్తున్నాను. `ఆర్ ఎక్స్ 100` గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను.  ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని అంద‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌నితో క‌లిసి ప‌నిచేస్తుంటే…  ఆ సినిమా ఎందుకు అంంత పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో ప‌నిచేయ‌డం చాలా స‌ర‌దాగా ఉంది. ఈ  ప‌రిచ‌యంతోనే నేను `హిప్పీ` టీజ‌ర్‌ విడుద‌ల చేశాను. `హిప్పీ` టీజ‌ర్‌ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. స‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ ల‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ స‌మ్మ‌ర్‌లో త‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుందని న‌మ్ముతున్నా“ అని అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ “నాని సార్‌తో ప‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో వ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌న చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకున్నా. నేను అడ‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. `నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు క‌దా సార్‌` అని అన్నా. `నువ్వు అడ‌క్క‌పోయినా చేసేవాడిని` అని నాని సార్ అన్నారు. అంత మంచి వ్య‌క్తి ఆయ‌న . షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌న బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు` అని అనుకుంటున్న త‌రుణంలో నాని గారితో ఈ సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌గ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా“ అని అన్నారు.

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?

ద‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ “మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసినందుకు నాని సార్‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఆయ‌న‌తో పాటు నేను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌గారికి ధ‌న్య‌వాదాలు చెప్పాలి. విక్ర‌మ్‌గారి షూటింగ్‌లో ఉండ‌గానే మేం  నానిగారితో టీజ‌ర్ విడుద‌ల చేయించాం“ అని అన్నారు.

విక్ర‌మ్‌.కె.కుమార్ మాట్లాడుతూ “కార్తికేయ‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాకు మంచి స్నేహితుడు. టీజ‌ర్ చూస్తుంటే మంచి ఫ‌న్ రైడ్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి. మంచి  టీమ్ క‌లిసి చేసిన చిత్ర‌మిది“ అని తెలిపారు.

నిర్మాత కలైపులి థాను  మాట్లాడుతూ “రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. ఒక పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, ఒక పాట‌ను ప‌బ్బులో చిత్రీక‌రిస్తాం. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం“ అని చెప్పారు.

నటీనటులు:

కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: టీఎన్ కృష్ణ

సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్

సంగీతం: నివాస్ కే ప్రసన్న

ఎడిటర్: ప్రవీణ్ కేఎల్

సాహిత్యం: అనంత శ్రీరాం

మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి

స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్

ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ul6tep

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...